Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?
ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 17న రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనుంది. 21వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో 1.12 కోట్ల మందికి పైగా పిల్లలు, విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించనుంది. ఈ కార్యక్రమం 21వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపడుతున్నారు.. ఈ అవకాశాన్ని అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది..
స్కూల్ , కాలేజీలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మాత్రల పంపిణీ చేయనున్నారు.. ఈ కార్యక్రమం ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో సహా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇతర శాఖల సమన్వయంతో నిర్వహించబడుతుంది.. ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఆదేశాల ప్రకారం 1,11,63,762 మంది విద్యార్థులకు ఉచితంగా మాత్రలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో 23,09,699 మంది ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు.. మిగతావారు ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్నారు..
నులిపురుగులు ముఖ్యంగా మట్టి ద్వారా వ్యాపిస్తాయి. శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. రక్తహీనత , శారీరక ఎదుగుదల లోపం , కడుపు నొప్పి వంటి సమస్యలు వాటి కారణంగా కలుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఆల్బోండజోల్ మాత్రలు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రధానమైన మార్గంగా నిలుస్తాయని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని వెల్లడించారు.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 1,12,63,762 మంది విద్యార్థులకు అందించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
