కొంప ముంచుతున్న బిర్యానీ సరదా.. ఇలా తింటే నేరుగా కైలాసానికే!

26 January 2026

TV9 Telugu

TV9 Telugu

ఇప్పుడంటే జొమాటో ఆపద్భాంధవుడు ఉన్నాడుగానీ.. ఒకప్పుడు బిర్యానీ అంటే అదో పెద్ద ప్రాసెస్‌. ఏ పండగో.. పబ్బమో.. అయితే తప్ప బిర్యానీ ఘుమ ఘుమలు కనిపించేవి కావు

TV9 Telugu

కానీ ఇప్పుడు అర్ధరాత్రి 12.. మార్నింగ్‌ 4.. టైం ఎప్పుడైనా బిర్యానీ.. తినాలనిపిస్తే ఒక్క ఫోన్‌ ఓపెన్‌ చేస్తే చాలు 10 నిమిషాల్లో గుమ్మం ముందు రుచులూరే బిర్యానీ వచ్చేస్తుంది

TV9 Telugu

ఈ కొత్త అలవాట్ల పుణ్యమా అని తిండికి వేళాపాళా లేకుండా పోతోంది.. ఒకరిని చూసి మరొకరు ఆ ఊబిలో చిక్కుకుపోతున్నారు.. ఆరోగ్య సమస్యల్ని కోరి కొని తెచ్చుకుంటున్నారు

TV9 Telugu

అసలు రాత్రి ఉన్నది తినడానికి కాదు.. హాయిగా నిద్రపోవడానికి కదా! అలాంటిది 12 గంటలకు, 2 గంటలకు.. ఉదయం 4 గంటలకు.. ఇలా వేళకాని వేళలో బిర్యానీలు తినడం ఏమిటీ?

TV9 Telugu

గతంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ సంస్కృతి కొత్తగా పట్టణాలకూ పాకుతోంది. లేట్‌నైట్‌ పార్టీలు.. పుట్టినరోజు వేడుకలు.. వారాంతపు సెలవులు.. అంటూ అర్ధరాత్రి బిర్యానీలు లాగించేస్తున్నారు

TV9 Telugu

రాత్రి 12 నుంచి 4 మధ్య తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవదు. ఇలా వారంలో కనీసం రెండుసార్లు చేసినా జీర్ణక్రియ చక్రం తప్పుతుంది. అంతేకాకుండా కడుపునిండుగా ఉండడంతో ఉదయం వ్యాయామం చేయలేరు

TV9 Telugu

రాత్రి 10 తర్వాత మాంసాహారం తింటే సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఆలస్యంగా తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది

TV9 Telugu

నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం చేయాలి. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఇన్సులిన్‌ స్థాయి ప్రభావితమై మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్‌ సమస్యలకు దారితీయొచ్చు