అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
ఇటీవలి కాలంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయి స్పృహ కోల్పోవడం, కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నాయి. జీవనశైలి, ఒత్తిడి ప్రధాన కారణాలు. బాసరలో సీపీఆర్ చేసి ఒకరి ప్రాణాలు కాపాడిన ఘటన సీపీఆర్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. గుండె ఆగిన తొలి ఐదు నిమిషాలు కీలకమని, సీపీఆర్ మెదడుకు రక్త ప్రసరణను కొనసాగిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకుని ప్రాణదాతలుగా మారడం అవశ్యం.
ఇటీవలి కాలంలో హఠాత్తుగా కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీఆర్ ప్రాణదాతగా మారుతోంది. యువకుల నుంచి వృద్ధుల వరకు వయస్సుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్‌కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి అనే వ్యక్తి అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. దర్శన క్యూలో నిలయఉన్నట్టుండి కూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆలయ హోంగార్డు సిబ్బంది ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్‌లు సీపీఆర్ చేయడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులు సీపీఆర్‌పై అవగాహన పెంచుకుని పలువురి ప్రాణాలను కాపాడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ సమయంలో గుండె స్పందనలు ఆగిపోతాయని, ఆ సమయంలో వెంటనే సీపీఆర్ చేయడం వల్ల మెదడుకు, ముఖ్య అవయవాలకు రక్తప్రసరణ కొనసాగుతుందని వైద్యులు చెబుతున్నారు.గుండె ఆగిన తర్వాత తొలి ఐదు నిమిషాలు అత్యంత కీలకమని, ఆ సమయంలో సీపీఆర్ చేస్తే ప్రాణాలను రక్షించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ చేసే విధానం తెలుసుకుని ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా
Mega158: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ??
రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్ పోలీసులకు SKN ఫిర్యాదు
Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్ మరి
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు
బేగంపేట స్టేషన్లో దిగిన మహిళ.. సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ

