AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

Phani CH
|

Updated on: Jan 26, 2026 | 9:20 AM

Share

ఉత్తర భారతం తీవ్ర చలి, హిమపాతంతో గజగజ వణుకుతోంది. మనాలీ, షిమ్లాలో భారీ మంచు కురవడంతో వేల పర్యాటకులు చిక్కుకుపోయారు. రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ వద్ద 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోగా, పోలీసులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. రహదారులు మూతబడటంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ శీతాకాలంలో పర్యాటకులకు ఇది తీవ్ర ఇబ్బంది కలిగించింది.

చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజా వణుకుతోంది. హిమాచల్‌లోని పర్యాటక ప్రాంతం మనాలీపై మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ల మధ్య దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీ కి పర్యటకులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని పరిస్థితి ఉంది. దీంతో వాహనాలు ముందుకు కదల్లేక ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు రాజధాని షిమ్లా కూడా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా కొన్ని రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసేసారు. ఏటా జనవరిలో మనాలీకి పర్యటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వచ్చాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Mega158: ‘జన నాయగన్‌’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ??

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి

‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం