అమెరికా H1B వీసా ఇంటర్వ్యూలు 2027కు వాయిదా పడ్డాయి. ఈ జాప్యం 2025 డిసెంబరులో మొదలై, ఇప్పుడు 2027కు చేరింది. దీనివల్ల వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు కుటుంబాలకు దూరమై, ఉద్యోగ భద్రతను కోల్పోతున్నారు. యూఎస్ కాన్సులేట్లలో పెరిగిన పెండింగ్ ఫైళ్లు, సోషల్ మీడియా స్క్రీనింగ్, థర్డ్ కంట్రీ ఆప్షన్ రద్దు వంటివి దీనికి ప్రధాన కారణాలు.