రాగి పాత్రలో నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!

Samatha

26 January 2026

చాలా మంది ప్లాస్టిక్ లేదా స్టీల్ వాటర్ బాటిల్స్‌లో ఎక్కువగా వాటర్ తాగుతుంటారు. కానీ రాగి బాటిల్‌లో, రాగి పాత్రలో వాటర్ తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.

రాగి పాత్ర

ఆయుర్వేద పరంగా రాగి పాత్రలో వాటర్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. కాగా దీని వలన కలి ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆయుర్వేదం

రాగి పాత్రలోని నీరు తాగడం వలన  ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో సహజ యాంటీ మైక్రోబయట్ లక్షణాలు కలిగి ఉండటం వలన ఇది ఇన్ఫెక్షన్స్‌తో పోరాడి ఇమ్యూనిటీని పెంచుతుంది.

రోగనిరోధక శక్తి

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా రాగి చాలా మంచిది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి, కడుపులోని ఆమ్లత్వం తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

బరువు నియంత్రణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రోజూ రాగి బాటిల్‌లో నీళ్లు తాగడం వలన ఇది కేలరీలను బర్న్ చేసి, బరువు నియంత్రణకు దోహద పడుతుంది.

బరువు నియంత్రణ

రాగిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన, రాగి బాటిల్‌లో నీరు తాగితే, ఇది వృద్ధాప్యా ఛాయలు తగ్గించి, చర్మానికి సహజ మెరుపునిస్తుంది.

చర్మ నిగారింపు

రాగి బాటిల్‌లో ప్రతి రోజూ నీరు తాగడం వలన ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని ఇనుమును గ్రహించి, ఎర్రరక్తకణాల పెరుగుదలకు దోహద పడుతుంది.

రక్త హీనత

రాగి పాత్రలోని నీరు తాగడ వలన ఇది హానికరమైన బ్యాక్టీరియాను నశింప చేసి స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

చెడు బ్యాక్టీరియా