మొగలి పువ్వు వాసనకు నాగు పాములు పరిగెత్తుక వస్తాయంటారు.. నిజమేనా?

Samatha

26 January 2026

పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు.

పాములు

అయితే పాములు ఎక్కువగా చెట్ల పొదల్లో ఉంటాయి. ముఖ్యంగా ఇంటి వద్ద కొన్నిరకాల మొక్కలు ఉండకూడదు ఉంటే పాములు వస్తాయని చెబుతుంటారు.

చెట్ల పొదలు

ఇక మన పెద్దవారు అయితే మల్లెపూల వాసనకు పాము వస్తుందని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా మొగిలి పువ్వు చెట్టు వద్దకు వెళ్లకూడదు, వాటి వాసనలకు అక్కడ నాగుపాములు ఉంటాయంటారు.

మొగలి పువ్వు

మరి నిజంగానే మొగిలి పువ్వు వాసనకు నాగు పాములు పరిగెత్తుక వస్తాయా? మొగలిపువ్వు చెట్టు వద్ద నాగుపాములు ఉంటాయా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మొగలి పూవు వాసన

అయితే మొగలి పువ్వు వాసను పాములు వస్తాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ, వీటి వద్ద మాత్రం పాములు ఉంటాయంట. దీనికి పలు కారణాలు ఉన్నాయంట

శాస్త్రీయ కారణాలు

మొగలి పువ్వు చెట్లు, పారిజాతం, మల్లెపూల వంటి చెట్లు చాలా దట్టంగా , మందంగా ఉంటాయి. అందువలన అవి అక్కడ నివాసం ఉండటానికి ఇష్టపడతాయంట.

దట్టమైన చెట్టు

ఈ చెట్లు గుబురుగా, ఆకులు దట్టంగా ఉండటం వలన నాగు పాములు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, అవి చెట్లను ఆవాసాలుగా చేసుకుంటాయంట.

ఆవాసం

అంతే కాకుండా ఇలాంటి చెట్లపై క్రిమి కిటీకాలు, పక్షులు కూడా ఎక్కువగా ఉండటం వలన ఇవి తమ ఆహారం కోసం కూడా ఈ చెట్ల వద్దకు ఎక్కువా వస్తాయని చెబుతుంటారు నిపుణులు.

క్రిమి కీటకాలు

 మరీ ముఖ్యంగా మొగలి పువ్వు చెట్టు అనేది చాలా దట్టంగా ఉంటుంది. ఇి ఏ సీజన్‌లో అయినా సరే ఉష్ణోగ్రతను నియంత్రించి, తమకు రక్షణనిస్తాయి కాబట్టి పాములు ఈ చెట్ల వద్ద ఎక్కువగా ఉంటాయంట.

మొగలి పువ్వు చెట్టు ఉష్ణోగ్రత