AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న రెబల్ స్టార్ రాజా సాబ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్రభాస్ సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందులోనూ హారర్ ఫ్యాంటసీ జానర్ కావడంతో ‘ది రాజా సాబ్’పై ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ క్రమంలోనే జనవరి 9న రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ విడుదలైంది.

The Raja Saab OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న రెబల్ స్టార్ రాజా సాబ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
The Raja Saab
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2026 | 12:00 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ సినిమాలు విడుదలై అంచనాలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్ ను వింటేజ్ లుక్ తో పాటు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూసి ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయ్యారు.

జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మారుతి చెప్పిన రేంజ్ లో సినిమా లేకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. చాలా మంది ఈ సినిమా పై విమర్శలు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని డార్లింగ్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రాజా సాబ్ సినిమా ఓటీటీ డీల్ పూర్తయ్యిందని.. ఓ ప్రముఖ సంస్థ రాజా సాబ్ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా డిజిటల్ హక్కులను  రూ. 80 కోట్లకు అమ్మారని తెలుస్తుంది. అన్ని భాషల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ రాజా సాబ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే రాజా సాబ్ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వీడియో సాంగ్స్ ను ఒకొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో రాజా సాబ్ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై  క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
కప్ప – ముత్యం నీతి కథ: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..!
కప్ప – ముత్యం నీతి కథ: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..!
మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?
మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?
ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!
ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!