కన్నీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?

Samatha

26 January 2026

కంటి నుంచి కన్నీరు రావడం అనేది సహజం. ఏడ్చినా, సంతోషపడినా, లేదా కంటిలో ఏదైనా దుమ్ము, బ్యాక్టీరియా చేరినా కంటి నుంచి నీరు వస్తుంటుంది.

కన్నీరు

అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కంటి నుంచి కన్నీళ్లు ఎందుకు వస్తాయి? ఇవి ఎలా వస్తాయని, కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

కన్నీళ్లు ఎందుకు వస్తాయి?

కన్నీళ్లు అనేవి మ్యూకస్, ఎలక్ట్రోలైట్లు, నీరు , ప్రోటీన్ , లిపిడ్లు వంటి వలన కన్నీరు రెడీ అవుతుందంట. ఈ ఐదు కూడా వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటాయంట.

కన్నీరు తయారీ

అలాగే మనం సంతోషం లేదా బాధపడినప్పుడు, మెదడులో లాక్రిమల్ గ్రంథి ప్రోటీన్, శ్లేష్మం, మ్యాకస్ వంటి వాటితో ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తుందంట. ఇవే కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయంట.

బాధ, సంతోషంలో

ఇక కన్నీరు అనేది కొన్ని సార్లు సంతోషంలో, కొన్ని సార్లు భావోద్వేగ పరంగా వస్తుంటాయి. అయితే ఈ కన్నీరు కూడా మూడు రకాలుగా ఉంటుందంట.

భావోద్వేగం

బేసల్ కన్నీరు : కంటి ఉపరితలంపై బేసల్ కన్నీరనేది ఎప్పుడూ ఉంటుందంట, ఇది కంటిని తడిగా ఉంచి రక్షిస్తుంది. ఇవి కళ్లు పొడిబారకుండా చేస్తాయి.

బేసల్ కన్నీరు

భావోద్వేగ కన్నీరు : ఇలాంటి కన్నీరు మీరు బాధపడినా, ఏదైనా సమస్యను ఎదుర్కొటున్నప్పుడు ఈ కన్నీళ్లు వస్తాయంట.

భావోద్వేగ కన్నీరు

నాన్ ఎమోషనల్ కన్నీరు : ఈ కన్నీరు, కంటిలో దుమ్ము పడినప్పుడు, ఉల్లిపాయలు కోసే క్రమంలో, కంటిలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు కన్నీరు వస్తుందంట.

నాన్ ఎమోషనల్ కన్నీరు