రూటు మార్చిన మాస్ రాజా రవితేజ.. కొత్త సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్
మాస్ మహారాజా రవితేజ తన 77వ చిత్రం #RT77 కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రవితేజ పుట్టినరోజును సందర్భంగా, మేకర్స్ ఈరోజు ఈ చిత్రం టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు

మాస్ మహారాజా రవితేజ ఇటీవలే బర్ధమాషయములకు విజ్ఞప్తి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా రవితేజ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. తన 77వ చిత్రం RT77 కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు రవితేజ. ఈ చిత్రానికి పవర్‌ఫుల్ ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఇది అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో ఉంటుందని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. అద్భుతమైన ఫస్ట్ లుక్‌లో రవితేజ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపించారు. భక్తులతో నిండిన వేడుక ఊరేగింపులో, గొప్ప ఆనందోత్సాహాలతో కనిపించడం ఒక ట్రాన్స్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రవితేజ పాపని ఎత్తుకుని చిరునవ్వుతో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా రవితేజ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు “జీవితంలో సరైన సమయంలో కొన్ని కథలు మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథలో మళ్ళీ భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను, నమ్మకమే మార్గదర్శకంగా సాగుతున్నాను.శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఇరుముడి అనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను..స్వామియే శరణం అయ్యప్ప” అంటూ రాసుకొచ్చారు రవితేజ. కాగా దర్శకుడు శివ నిర్వాణ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది, రవితేజకు మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అవుతున్నారని మేకర్స్ తెలిపారు.
ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రను పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర,స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఇరుముడి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




