AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. అంతకుమించి..

ఆగస్ట్ 15న ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు ‘స్త్రీశక్తి’ పథకం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని మహిళలు పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ వరకు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత, పరిశుభ్రత, సదుపాయాల మెరుగుదల, రద్దీ నియంత్రణపై సీఎం చంద్రబాబు అధికారులను దిశానిర్దేశం చేశారు.

Andhra: కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. అంతకుమించి..
Andhra Free Bus Travel For Women
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 12, 2025 | 4:55 PM

Share

ఆగస్ట్ 15 ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ  వేడుకలతో పాటు మరో వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదే రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నస్త్రీ శక్తి పథకం అమలు కార్యక్రమం. ఇందుకోసం భద్రత, సదుపాయాలు, రద్దీ నియంత్రణ.. అన్నీ సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలులో ఎక్కడా లోపం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

బస్ స్టేషన్ల పరిశుభ్రత – సదుపాయాల మెరుగుదల

కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. బస్టాండ్స్, బస్సుల్లో సదుపాయాలకు సంబంధించి సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.  బస్ స్టేషన్లలో టాయిలెట్లు ప్రతి రెండు గంటలకు శుభ్రం చేయాలన్నారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు తప్పనిసరి అని సూచించారు. రూ.30 కోట్లతో జరుగుతున్న మరమ్మతులు, పెయింటింగ్ పనులు డిసెంబర్‌లోపు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల కొత్త ఫ్యాన్లు, చైర్లు ఏర్పాటు చేయాలని, 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.

రద్దీకి అదనపు సర్వీసులు – ఆగస్ట్ 15న విజయవాడలో ప్రారంభం

పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌.. ఇలా మొత్తం ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. జీరో ఫేర్ టిక్కెట్ల కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆగస్ట్ 14 నాటికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని సీఎం ఆగస్ట్ 15 మధ్యాహ్నం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ప్రారంభిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.