AP Weather Report: అల్లకల్లోలంగా బంగాళాఖాతం.. నాలుగు రోజులు అతి భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు ఐఎండీ వార్నింగ్..
AP Weather News: ఆంధ్రప్రదేశ్‌కి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ నాన్‌స్టాప్‌గా వానలు దంచుతున్నాయి.

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌కి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ నాన్‌స్టాప్‌గా వానలు దంచుతున్నాయి. మరోవైపు గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. దాంతో, ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వానలు బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖపట్నం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అయితే ఒక రేంజ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు తోడు, ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
గంటగంటకీ గోదావరిలో నీటిమట్టం పెరిగిపోతోంది. పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో, పోలవరం ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేసి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో అయితే వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ భయపెడుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ వంతెన నీట మునగడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధనపుట్టు మత్స్యగడ్డ పొంగడంతో 50 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం అయితే పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఆలయం చుట్టూ వరద నీరు పోటెత్తడంతో అమ్మవారి విగ్రహం సైతం నీట మునిగింది.




అయితే, రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయంటోన్న వాతావరణశాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి నలభై యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది వెదర్ డిపార్ట్‌మెంట్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
