Andhra Pradesh: సీసీ కెమెరాల్లో వింత దృశ్యాలు.. ఎవరో తెలిసి షాకైన పోలీసులు..!
Andhra Pradesh: విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అరా తీస్తున్నారు. గతంలోనూ విశాఖలో దిగంబర దొంగల కేసులు నమోదయ్యాయి. విజయ్ కూడా గతంలో ఇదే విధంగా చోరీలు చేసి అరెస్టు అయ్యాడు. మళ్లీ..

విశాఖలో ఎంవిపి కాలనీ.. సెక్టర్ 6.. ఒక్కసారిగా కలకలం.. ఎందుకంటే సీసీ కెమెరాలు వింత దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అవి చూశాక ఒకటే హడల్.. ఓ వ్యక్తి వింతగా నడుస్తూ ఉన్నాడు. శరీరంపై షర్ట్ లేదు.. ఫ్యాంట్ లేదు.. కనీసం ఇన్నర్ వేర్స్ కూడా లేవు.. శరీరంపై నూలు పోగు కూడా లేదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైర్ ల్ అయ్యాయి. వాటిపై విశాఖలో ఒకటే చర్చ.. ఇంతకీ ఆ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలేంటి..? ఆ వ్యక్తి ఎవరు..? ఎందుకలా వచ్చాడు.?!
విశాఖ నగరంలో ఓ దిగంబరంగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు..! ఒంటిపై నూలుపోగు లేకుండా రెండు ఇళ్లల్లో చోరీ చేసేందుకు ప్రయత్నించి, ఒక ఇంట్లో కొద్దిపాటి నగదును దొంగిలించాడు. ఎంవిపి కాలనీ సెక్టర్ 6 లో ఈ దొంగ చోరీ చేసేందుకు వచ్చి సీసీ కెమెరాకు చిక్కాడు. విశాఖ సిటీలో కొత్త తరహాలో జరిగిన ఈ చోరీతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఫోకస్ పెట్టిన పోలీసులు దొంగను పట్టుకున్నారు .
వాడే.. వీడు..!
నిందితుడు విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు వడ్డాది విజయ్ అలియాస్ పొట్టి విజయ్ గా గుర్తించారు పోలీసులు. విజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నగదు కొంతే పోవడంతో ఫిర్యాదు చేసేందుకు బాధితుల ముందుకు రాకపోయేసరికి పోలీసులే చొరవ చూపారు. ఊరికే వదిలేస్తే మేకై కూర్చుంటాడని ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు.
అందుకోసమే అలా..!
విజయ్ పై గతంలోనూ చోరీ కేసులు ఉన్నాయి. విజయ్.. ఒంటిపై దుస్తులు లేకుండా దొంగతనాలకు వెళ్లడానికి గల కారణం ఏంటో తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. దొంగతనం చేసే సమయంలో స్థానికులకు పట్టుబడితే.. మతిస్తిమితం లేని వ్యక్తిగా జనాలను డైవర్ట్ చేసేందుకు నగ్నంగా వెళ్తాడట. ఎవరికి అనుమానం రాకుండా ఇలాంటివి చేస్తున్నాడని ద్వారకా క్రైమ్ సీఐ చక్రధరరావు అన్నారు.
గతంలోనూ పలుమార్లు..!
విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అరా తీస్తున్నారు. గతంలోనూ విశాఖలో దిగంబర దొంగల కేసులు నమోదయ్యాయి. విజయ్ కూడా గతంలో ఇదే విధంగా చోరీలు చేసి అరెస్టు అయ్యాడు. మళ్లీ ఇప్పుడు తాజాగా కనిపించడంతో పోలీసులు ఈసారి గట్టిగానే చర్యలు తీసుకునేలా సిద్ధమవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి