Contract Nurse: మాకూ వారిలాగే ఇవ్వండి.. కాంట్రాక్ట్ నర్సుల డిమాండ్.. ఈ నెల 28న సమ్మె..

Contract Nurse: కొవిడ్ విధులు నిర్వహిస్తున్న రెగ్యూలర్ వైద్య సిబ్బందిలాగే తమకూ రూ. 50 లక్షలకు బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని...

Contract Nurse: మాకూ వారిలాగే ఇవ్వండి.. కాంట్రాక్ట్ నర్సుల డిమాండ్.. ఈ నెల 28న సమ్మె..
Nurse
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 17, 2021 | 8:08 AM

Contract Nurse: కొవిడ్ విధులు నిర్వహిస్తున్న రెగ్యూలర్ వైద్య సిబ్బందిలాగే తమకూ రూ. 50 లక్షలకు బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సెస్ యూనియన్ డిమాండ్ చేసింది. తాము కూడా కోవిడ్ సేవలు అందిస్తున్నామని, తమ పట్ల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 28వ తేదీన సమ్మె చేపడతామని ప్రకటించారు.

కాగా, తమ సమస్యలు పరిష్కరించాలంటూ మూడు రోజులుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్‌లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సెస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, అధ్యక్షులు దయామణి, ప్రధాన కార్యదర్శి భవాని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Also read:

Allu Arjun Pushpa: పుష్ప సినిమాలో ఆ ఫైట్ కోసం హాలీవుడ్ కంపోజర్లను రంగంలోకి దింపనున్నారా..