Watermelon Seeds: పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా..

Watermelon Seeds: ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారి సంఖ్య మన దేశంలో రోజు రోజుకీ అధికం అవుతుంది. కిడ్నీ స్టోన్స్ తో చిన్న పెద్ద అంటూ ఇబ్బంది పడుతున్నారు...

Watermelon Seeds:  పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా..
Water Melon
Follow us

|

Updated on: Jun 17, 2021 | 7:57 AM

Watermelon Seeds: ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారి సంఖ్య మన దేశంలో రోజు రోజుకీ అధికం అవుతుంది. కిడ్నీ స్టోన్స్ తో చిన్న పెద్ద అంటూ ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి కనుక కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే.. ఇక లైఫ్ లాంగ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ను ఏర్పడిన తర్వాత వాటిని కరిగించుకున్నా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే కిడ్నీ స్టోన్స్ ను నివారించే చిట్కాను పాటిస్తే.. కిడ్నీ స్టోన్లు ఇక ర‌మ్మ‌న్నా రావు. అంత ఎఫెక్టివ్‌గా ఆయుర్వేదం చిట్కా ప‌నిచేస్తుంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి దాహార్తిని తీర్చే పుచ్చకాయలు ఎక్కడ చూసినా కనువిందు చేస్తున్నాయి. సర్వసాధారణంగా పుచ్చకాయలను తిని వాటి గింజలను పడేస్తాం.. కానీ ఆ పుచ్చకాయలోని గింజలకు కిడ్నీలోని స్టోన్స్ ను కరిగించే శక్తి ఉంది. పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది.

*పుచ్చ‌కాయ గింజ‌ల‌ను పడేయకుండా వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలుపుకుని రోజుకి మూడుసార్లు చొప్పున కొన్నిరోజుల పాటు తాగితే కిడ్నీ స్టోన్స్ ఈజీగా కరిగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు, పుచ్చకాయ గింజల నీరు తగిన తర్వాత కిడ్నీ స్టోన్స్ కరిగితే మళ్ళీ ఎప్పటికీ వచ్చే అవకాశం లేదని ఆయుర్వేదం చెబుతుంది.

* పుచ్చకాయ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే.. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు ఈజీగా కరుగుతాయట

* పుచ్చకాయ గింజలను ఆహారం తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.

*గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.

అలాగే పుచ్చకాయ లోపల ఎర్రటి భాగం కింద ఉండే ఉండే తెల్లని పదార్థాన్ని శరీరంలో ఫంగస్ ఉన్న ప్రాంతంలో రాస్తే అద్భుత ఫలితం ఉంటుంది.

కనుక ఇప్పటి నుంచి పుచ్చకాయ తినే సమయంలో ఎర్రటి పదార్ధాన్ని తినేసి.. మిగిలిన తెల్లటి పదార్ధం.. గింజలను పడేయకండి. అవసరానికి అనుగుణంగా వాటిని ఉపయోగించి కిడ్నీ స్టోన్స్ , స్కిన్ ఎలర్జీల నుంచి బయటపడండి.,

Also Read: సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం… ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి