- Telugu News Andhra Pradesh News Andhra Pradesh: Sharannavaratri celebrations celebrated grandeur at Kanakadurgamma temple in Koyyuru
Kanakadurgamma Temple: కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. భక్తి శ్రద్ధలతో పూజలు
కొయ్యురు, అక్టోబర్ 20: శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామ గ్రామాల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గ్రామ ఆచారాలు సాంప్రదాయాలు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అల్లూరి జిల్లా కొయ్యురు లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. హిమగిరిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో విశేష పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భారీగా ఊరేగింపుతో ప్రతి ఇంటి నుంచి..
Maqdood Husain Khaja | Edited By: Srilakshmi C
Updated on: Oct 20, 2023 | 7:25 PM

కొయ్యురు, అక్టోబర్ 20: శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామ గ్రామాల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గ్రామ ఆచారాలు సాంప్రదాయాలు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అల్లూరి జిల్లా కొయ్యురు లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

హిమగిరిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో విశేష పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భారీగా ఊరేగింపుతో ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు కదలారు. పసుపు కుంకుమలతో నైవేద్యాలతో సారెను ఊరేగించారు. కొండపై వెలసిన అమ్మవారికి సారె సమర్పించారు.

అల్లూరి జిల్లా.. కొయ్యురు మండలంలోని హిమగిరి పై కొలువైన గ్రామదేవత కనకదుర్గమ్మ కి గ్రామస్థులు సారె సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆలయంలో వేకువయ్య నుంచి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. కొయ్యూరుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ముత్తయిదువులు, యువతులు అమ్మవారికి పిండి వంటలు, పసుపు కుంకుమ, సారె చీరలు పట్టుకుని గ్రామమంతా తిరిగారు.

భక్తి శ్రద్ధల మధ్య అమ్మవారిని జయ జయ ధ్వనాలతో ముందుకు కదలారు. గ్రామస్థులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకున్నారు. అధిక సంఖ్యలో మహిళలు తమ ఇళ్ల వద్ద సారె సిద్ధం చేసి తలపై పెట్టుకుని పురవీధుల గుండా మేళతాళాలు, బాజాభజంత్రీల నడుమ అమ్మకు జేజేలు పలుకుతూ ఊరేగింపుగా ముందుకు కదిలారు.

అనంతరం కొండపై ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని గ్రామంలోని వారంతా ఆయురారోగ్యాలతో వుండేలా చల్లని చూపులు ప్రసరించాలని కోరుకున్నారు.





























