Andhra Pradesh: గిరిజనులతో పోలీసుల సహపంక్తి భోజనాలు.. కలిసి ఆటలపోటీలు. ఎందుకో తెలుసా?

అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో గిరిజనుల్లో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇప్పటికే సేవా కార్యక్రమాలతో గిరిజనులు మచ్చిక చేసుకుంటున్న పోలీసులు, గిరిజనులు సంఘ విద్రోహక శక్తుల వైపు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో సేవలను విస్తృతం చేశారు.

Andhra Pradesh: గిరిజనులతో పోలీసుల సహపంక్తి భోజనాలు.. కలిసి ఆటలపోటీలు. ఎందుకో తెలుసా?
Ap Police
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: Feb 16, 2024 | 7:59 PM

అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో గిరిజనుల్లో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇప్పటికే సేవా కార్యక్రమాలతో గిరిజనులు మచ్చిక చేసుకుంటున్న పోలీసులు, గిరిజనులు సంఘ విద్రోహక శక్తుల వైపు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో సేవలను విస్తృతం చేశారు.

అల్లూరి ఏజెన్సీ పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో జీ మాడుగుల మండలం మద్దిగరువు, బోయితిలి పంచాయతీలు ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట. ఇప్పటికీ ఆయా ప్రాంతాలపై మావోయిస్టు ప్రభావం పరోక్షంగా ఉంటుంది. పోలీసులు కూడా గతంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. అటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదాలు మారుమోగుతున్నాయి.

వాలిబాల్ టోర్ని.. గిరిజనులతో పోలీసుల సహాపంక్తి భోజనం..

ఇటువంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. గిరిజనులను మచ్చిక చేసుకోవడమే కాదు, ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా బలోపేతం చేసుకుంటున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో వాలీబాల్ టోర్నమెంట్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గిరిజనుల అభిమానాన్ని చురగొంటున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో.. ఏఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో తాజాగా జీ మాడుగుల మండలం మద్దిగరువు లో మెగా వాలిబాల్ టోర్ని ఏర్పాటు చేశారు పోలీసులు.

స్థానిక గిరి యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు జిల్లా ఎస్పీ. ఈ టోర్నమెంట్‌లో 59 టీమ్స్ పాల్గొన్నాయి. దీనిలో విన్నర్ అయిన లింగేరిపుట్టు టీం, రన్నర్ ఎగవ మండిబ టీం, థర్డ్ ఇనపతిగలు టీంలకు అడిషనల్ ఎస్పీ ధీరజ్.. నగదు బాహుమతి తో పాటు ట్రోఫీలు కూడా అందజేశారు. చుట్టుపక్కల పంచాయతీల నుంచి కూడా భారీగా గిరిజనులు తరలివచ్చారు. అంతేకాదు గిరిజనులకు పోలీసులే స్వయంగా భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు ఏఎస్పీ ధీరజ్ . టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు.

పోలీస్ ఉచిత బస్సు సర్వీస్..

అంతకుముందు జీ. మాడుగుల పోలీస్ ఆధ్వర్యంలో ఉచితంగా నడిపిస్తున్న బస్ సర్వీస్‌ను మద్దిగరువు నుండి బోయితీలి వరకు పెంచుతు సర్వీస్ ప్రారంభించారు. ఆ బస్సులో గిరిజనులతో కలిసి అడిషనల్ ఎస్పీ ధీరజ్, జీ మాడుగుల సిఐ రమేష్ మద్దిగరువు వరకు ప్రయాణించారు.

గిరిజిన యువత చెడు వ్యసనాలకు, గంజాయి సాగుకు, రవాణాకు, సంఘ వ్యతిరేఖ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఏఎస్పీ ధీరజ్ కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయని, అదే విధంగా చదువుపై దృస్టి పెట్టి ఉన్నత స్టాయికి ఎదగాలని ఆకాంక్షీంచారు. గిరిజనులకు మేమున్నామనే భరోసా కల్పించారు పోలీసులు. పోలీసులు ఇలా తమతో మమేకమై భరోసా కల్పింస్తుండడంతో చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు అమాయక గిరిజనులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…