AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Doctors Probation: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త వైద్యులకు మూడేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగు పరిచేందుకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వైద్య సరికరాల అధునీకరణతో పాటు వైద్య సిబ్బందిని పెంచుతోంది.

AP Doctors Probation: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త వైద్యులకు మూడేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌
Ap Doctors Probation Period
Balaraju Goud
|

Updated on: Aug 31, 2021 | 9:31 AM

Share

Andhra Pradesh New Medical Rules: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగు పరిచేందుకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వైద్య సరికరాల అధునీకరణతో పాటు వైద్య సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసేలా చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇస్తున్నా పని చేసేందుకు వైద్యులు ముందుకురాని పరిస్థితి. మరోవైపు తాజాగా చేపట్టిన వైద్యుల నియామకాల్లో ఉన్న రెండేళ్ల ప్రొబేషన్‌ను మూడేళ్లకు పెంచింది. దీంతో వైద్యులు ఎంతవరకు ఆసక్తి చూపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వైద్య విధాన పరిషత్‌ జిల్లా ఆసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని అవసరాల కోసం 12 విభాగాల్లో 453 పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తే సుమారు 800 దరఖాస్తులొచ్చాయి.

బోధనాసుపత్రుల్లో ప్రత్యక్ష విధానంలో 32, లేటరల్‌ ఎంట్రీ ద్వారా 17 మంది వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా కేవలం 90 మందే దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వైద్య విధాన పరిషత్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో కన్సాలిడేటెడ్‌ వేతనం కింద నెలకు రూ.53వేలను చెల్లిస్తామని, తొలి మూడేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌లో పనితీరు సంతృప్తికరంగా ఉంటే…రెగ్యులర్‌ వేతనంతోపాటు ఇతర అలవెన్సులూ ఇస్తామని పేర్కొన్నారు. డీఎంఈ జారీ చేసిన ప్రకటనలో మూడేళ్లపాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుందని, నెలకు రూ.92వేలు కన్సాలిడేటెడ్‌ వేతనం ఇస్తామని వెల్లడించారు.

అయితే, రెగ్యులర్‌ స్కేల్‌కు బదులు ‘కన్సాలిడేటెడ్‌’ వేతనం ఇస్తామని చెప్పినందున వైద్య విధాన పరిషత్‌ ద్వారా నియమితులయ్యే వైద్యులకు అందాల్సిన మొత్తం వేతనంలో రూ.25వేలు తగ్గింది. ప్రొబేషన్‌ పీరియడ్‌ తగ్గించి, వేతనాల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌ జయధీర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు నోటిఫికేషన్లలో మూడేళ్ల ప్రొబేషన్‌ గురించి శాఖాపరమైన సర్వీసు నిబంధనలపై అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర ఆరా తీశారు. మరోవైపు, నర్సులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందికి ఇచ్చే వేతనాల చెల్లింపుల్లోనూ ఉన్న వ్యత్యాసాల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి గురించి ఆర్థికశాఖతో సంప్రదించనున్నారు.

Read Also…  September Horoscope: సెప్టెంబర్‌ నెలలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఎవరికి ఎలా ఉందంటే..