AP Municipal Elections 2021 Highlights: ఏపీలో ప్రశాంతగా ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. కుప్పంపైనే అందరి ఫోకస్!

| Edited By: Subhash Goud

Updated on: Nov 15, 2021 | 5:16 PM

Andhra Pradesh Municipal Elections Highlights : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పెండింగ్ మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న వార్డులు,..

AP Municipal Elections 2021 Highlights: ఏపీలో ప్రశాంతగా ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. కుప్పంపైనే అందరి ఫోకస్!
Ap Municipal Elections 2021

Andhra Pradesh Municipal Elections Highlights : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పెండింగ్ మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న వార్డులు, డివిజన్లలో నిర్వహించే పురపోరు అయినప్పటికీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు మ‌రో 12 చోట్ల ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్ లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు.  అయితే.. మొత్తం 353 స్థానాలకు గానూ 28 వార్డులు ఏకగ్రవమయ్యాయి. 325 డివిజన్లకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 1206మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. టీడీపీ ఈసారైనా పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్‌, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగగా, వీటిలో 28 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 325 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరిగింది. ఆయా స్థానాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది బరిలో ఉన్నారు.  908 పోలింగ్‌ కేంద్రాల్లో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైనవిగా గుర్తించారు. 2,038 బ్యాలెట్‌ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల17న కౌంటింగ్ ఉంటుంది

ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటూ.. బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లిలో ఎన్నికలు జరిగాయి. గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు ఉన్నాయి. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక నిర్వహించారు. ఇక కుప్పంలో మున్సిపల్‌ ఎన్నికలు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. రాష్ట్రమంతా ఓ ఎత్తు..కుప్పం ఓ ఎత్తు అన్నట్టుగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేశారు. చంద్రబాబు కోటలో పాగా వేయాలని వైసీపీ శతవిధాలా ప్రయత్నాలు చేసింది. మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీంతో కుప్పంలో గెలుపెవరిదన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

నెల్లూరు నగరపాలక సంస్థ సహా పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మునిసిపాలిటీల్లో పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగింది.

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు, వెబ్‌ కాస్టింగ్‌  ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ ఆఫీసర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి 4 వేల మందికిపైగా పోలింగ్‌ విధుల్లో ఉన్నారు. 556 సూక్ష్మ పరిశీలన, 81 రూట్‌ ఆఫీసర్‌లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Nov 2021 05:06 PM (IST)

    పోలింగ్‌ ప్రశాంతం

    ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ముగిసినా.. క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 17వ తేదీన కౌంటింగ్‌ ఉంటుంది.

  • 15 Nov 2021 05:03 PM (IST)

    ఏపీలో ముగిసిన పోలింగ్‌..

    ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగర పంచాయతీల్లో పోలింగ్‌ పూర్తయింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్‌ కొనసాగింది.

  • 15 Nov 2021 04:51 PM (IST)

    కుప్పం ఎన్నికల్లో టీడీపీ నేతల ఆందోళన

    కుప్పం ఎన్నికల్లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో చిత్తూరు ఎస్పీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డులో వైసీపీ దొంగ ఓట్లు వేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అనుమతించలేదు. టీడీపీ కార్యకర్తలు-పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠీచార్జ్‌ చేశారు.

  • 15 Nov 2021 03:59 PM (IST)

    ప్రశాంతగా కొనసాగుతున్న మున్సిపల్‌ పోలింగ్‌

    ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెండింగ్‌లో ఉన్న మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న వార్డులు, డివిజన్లలో నిర్వహించే పురపోరు అయినప్పటికీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు మ‌రో 12 చోట్ల ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అయితే.. మొత్తం 353 స్థానాలకు గానూ 28 వార్డులు ఏకగ్రవమయ్యాయి. 325 డివిజన్లకు పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 1206మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • 15 Nov 2021 03:45 PM (IST)

    మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్‌ శాతం..

    మధ్యాహ్నం 3.30 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో 38.9 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కమలాపురంలో 71.84 శాతం, రాజంపేటలో 60.47 శాతం, పెనుగొండలో 75.99 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు.

  • 15 Nov 2021 03:35 PM (IST)

    నెల్లూరు కార్పొరేషన్‌లో పోలింగ్‌ శాతం

    మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో 30.13 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక కుప్పలో 70 శాతం, రాజంపేటలో 50.35 శాతం, జగ్గయ్యపేటలో 57 శాతం, పెనుకొండలో 55.91 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 15 Nov 2021 03:22 PM (IST)

    కుప్పంలో పోలింగ్‌ శాతం

    కుప్పంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్‌ పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి భారీగా పోలింగ్‌ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

  • 15 Nov 2021 03:10 PM (IST)

    వర్షంలోనూ ఓట్లు..

    పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షంలోనూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పరిశీలించారు.

  • 15 Nov 2021 02:51 PM (IST)

    మధ్యాహ్నం ఒంట గంట వరకు పోలింగ్ శాతం

    మధ్యాహ్నం ఒంట గంట వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో 30.13 శాతం పోలింగ్‌ నమోదు కాగా, కుప్పంలో 68 శాతం, రాజంపేటలో 50.35 శాతం, గురజాలలో 53.72 శాతం, పెనుగొండలో 55.91 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • 15 Nov 2021 01:44 PM (IST)

    ప్రేమసమాజం పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ ప్రేమసమాజం పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాటకు దారితీసింది. పోలింగ్‌ కేంద్రంలోకి వైసీపీ కండువాలతో వచ్చిన కార్యకర్తలను జనసేన కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు.

  • 15 Nov 2021 01:14 PM (IST)

    చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు

    వైసీపీ నేతలు SECని కలిశారు. కుప్పంలో ఓటర్లను భయపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఒకవైపు పోలింగ్‌ జరుగుతుంటే మరోవైపు ఓటర్లతో, నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. చిన్న మున్సిపాల్టీలో ఎన్నికకే చంద్రబాబు భయపడిపోతున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.

  • 15 Nov 2021 12:36 PM (IST)

    11గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే?

    అనంతపురం జిల్లా పెనుకొండ నగరపంచాయతీ - 36.5 శాతం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్‌లో - 20 శాతం నెల్లూరు కార్పొరేషన్‌ - 15.9 శాతం కుప్పం మున్సిపాలిటీ - 37.75 శాతం బుచ్చిరెడ్డిపాలెం - 37.31 శాతం బేతంచర్ల - 43.56 శాతం ఆకివీడు - 37.52 శాతం దర్శి - 35.16 శాతం జగ్గయ్యపేట - 27 శాతం కమలాపురం - 42.45 శాతం రాజంపేట - 34.38 శాతం దాచేపల్లి - 39.39 శాతం గురజాల - 35.55 శాతం

  • 15 Nov 2021 12:06 PM (IST)

    కుప్పంలో దొంగ ఓట్ల కలకలం

    కుప్పంలో దొంగఓట్లు కలకలం రేపాయి. పలువురు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. వారి ఐడీకార్డును పరిశీలించారు. స్థానికేతరులు ఉన్నారని టీడీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు.

  • 15 Nov 2021 12:05 PM (IST)

    వైసీపీపై SECకి టీడీపీ ఫిర్యాదు

    మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని SECకి ఫిర్యాదు చేసింది టీడీపీ. ఆ పార్టీ నేతలు బోండా ఉమ, అశోక్‌బాబు SEC నీలం సాహ్నిని కలిసి ఫిర్యాదు చేశారు. కుప్పంలో ఒక్కో ఓటుకి ఏడు వేల ఇస్తున్నారని, మరికొన్ని చోట్ల ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, SEC ఆఫీస్‌లోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు బోండా ఉమ.

  • 15 Nov 2021 12:03 PM (IST)

    ఆకివీడులో 37.68 శాతం పోలింగ్‌

    ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.68 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆకివీడు నగర పంచాయితీ పోలింగ్ ప్రక్రియని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మస్వయంగా పర్యవేక్షించారు. ప్రజలు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు.

  • 15 Nov 2021 11:18 AM (IST)

    కాకినాడలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు బాహాబాహీ

    కాకినాడలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. 16 వార్డు దగ్గర వైసిపి కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ వాళ్లే దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

    Kakinada

    Kakinada

  • 15 Nov 2021 10:57 AM (IST)

    గురజాల మున్సిపాలిటీ ఎన్నికల్లో టెన్షన్‌

    గుంటూరుజిల్లా గురజాల మున్సిపాలిటీ ఎన్నికల్లో టెన్షన్‌ నెలకొంది. 17 వార్డులో పోలీసులు- టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాలంటీర్లు పోలింగ్‌ కేంద్రం దగ్గర వైసీపీకి ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వాలంటీర్లను అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

  • 15 Nov 2021 10:55 AM (IST)

    కుప్పంలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ

    కుప్పం మున్సిపాల్టీలోని 16 వార్డులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌ పోటీలో ఉన్న 16 వార్డు పోలింగ్‌ బూత్‌లో వైసిపి దొంగ ఓటర్లను దింపిందని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే కావాలనే రాద్ధాంతం చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు పరస్పరం నెట్టుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.

  • 15 Nov 2021 10:53 AM (IST)

    చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్‌ ఫైర్

    చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి నేత శ్రీనివాసులు ఓ రౌడిషీటర్‌ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక హంతకుడిని వార్డు ఇంఛార్జ్‌గా చెప్పుకోవడం చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు. అతనికి ఏదైనా జరిగితే తనదేలా బాధ్యత అవుతుందని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగానే శ్రీనివాసులుకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారన్నారు.

  • 15 Nov 2021 10:32 AM (IST)

    గోరంట్ల మాధవ్‌ - పార్థసారథి పరస్పరం తిట్ల దండకం

    అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపాలిటీల్లో జరిగింది. లోకల్‌గా ఎలక్షన్స్ జరుగుతుంటే ఎంపీ ఎలా వస్తారు అని ప్రశ్నించారు పార్థసారథి. సిగ్గు ఉండాలంటూ ఎంపీ మాధవ్ పై తీవ్రస్థాయిలో స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారు. దానికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఇంకా మీదే పరిపాలన అన్నట్లుగా దౌర్జన్యం చేయవద్దంటూ మాటకుమాట విసిరారు. నువ్వు డబ్బు మద్యం పంచావంటూ పార్థసారథిపై మాధవ్ ఆరోపణలు చేస్తే.. చీరలు, మందు పంచింది ఎవరో అందరికీ తెలుసంటూ పార్థసారథి రివర్స్ అయ్యారు. పోలీసులు సర్దిచెబుతున్నా.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇద్దర్నీ చెరోవైపు నడిపించుకుంటూ, కంట్రోల్‌ చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు..

  • 15 Nov 2021 10:18 AM (IST)

    కుప్పం ఫిర్యాదులపై ఎస్ఈసీ విచారణ

    చిత్తూరు కలెక్టర్, ఎస్పీ లకు ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు లేఖ రాశారు. కుప్పంలో వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘింస్తున్నారంటూ టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు వాలంటీర్లతో ప్రచారం చేస్తున్నారని, ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని, దొంగ ఓట్లు వేయించేందుకు స్థానికేతరులను తెస్తున్నారని తెలుగుదేశం అభ్యర్థులు పంపిన 24 ఫిర్యాదుల లేఖను జతచేసింది ఎన్నికల సంఘం అధికారులు.

  • 15 Nov 2021 10:05 AM (IST)

    అనంతపురంలో పోలింగ్ ప్రశాంతం

    అనంతపురం 17వ డివిజన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మృతి చెందడంతో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైసీపీ , బీజీపే పోటీలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది...

  • 15 Nov 2021 10:04 AM (IST)

    పెనుకొండలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ

    కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పెనుకొండ నగర పంచాయతీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెనుకొండ నగర పంచాయతీగా ఏర్పడిన తరువాత తొలిసారిగా ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 20 వార్డులు ఉండగా.. 51మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 20,584 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 20బ్లాక్‌లకు 22పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు 27 మంది పీఓలు, 27మంది ఏపీఓలు ఇతరులు 77మంది, మై క్రో అబ్జర్వర్లను 22మందిని నియమించారు.

  • 15 Nov 2021 09:59 AM (IST)

    బుచ్చిరెడ్డి పాలెంలో వైసీపీ-బీజేపీ మధ్య ఘర్షణ

    నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో వైసీపీ-బీజేపీ మధ్య వివాదం నెలకొంది. పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. పోలీసులు సహకరిస్తున్నారని కూడా ఆరోపిస్తోంది ఆ పార్టీ. కేంద్రం లోపల వైసీపీ అభ్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ అడ్డుకోవడం.. వైసీపీ కూడా రివర్స్‌ ఎటాక్ చెయ్యడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

  • 15 Nov 2021 09:56 AM (IST)

    బేతంచర్లలో 18.73 శాతం పోలింగ్

    బేతంచర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 18.73 శాతం పోలింగ్ నమోదైంది.

  • 15 Nov 2021 09:55 AM (IST)

    ఆకివీడులో 13.68 శాతం పోలింగ్‌

    ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 13.68 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 15 Nov 2021 09:47 AM (IST)

    విశాఖ 61వ వార్డులో కొనసాగుతున్న పోలింగ్

    గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 61వ వార్డులో YCP కార్పొరేట్ దాడి సూర్యకుమారి మృతితో ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఇక్కడ సూర్యకుమారి కుమార్తె కొణతాల సుధ YCP అభ్యర్థిగా ఎం.నాగమణి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చనిపోయిన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులపై పోటీ ఉండకూడదనే సాంప్రదాయాన్ననుసరిస్తూ 61వ వార్డులో పోటీకి దూరంగా టిడిపి ఉంది. 61వ వార్డ్ లో ఓటర్ల సంఖ్య 13,464 కాగా...13 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

  • 15 Nov 2021 09:43 AM (IST)

    విశాఖలో మందకొడిగా పోలింగ్

    గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31, 61 వార్డులలో ఉప ఎన్నికల పోలి౦గ్ కొనసాగుతోంది. ప్రారంభంలో పోలింగ్ బూత్ల వద్ద కాస్త మందకొడిగానే ఓటర్లు ఉన్నారు. ఉదయం పోలింగ్ పై కార్తీక సోమవారం ప్రభావం కూడా కన్పిస్తోంది. రెండు వార్డుల్లో కలిపి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 31వ వార్డులో టిడిపి కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతితో ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఇక్కడ రవికుమార్ భార్య గాయత్రి ఫణికుమారి TDP అభ్యర్థిగా, బిపిన్ కుమార్ జైన్YCP అభ్యర్థిగా, పార్వతి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

  • 15 Nov 2021 09:40 AM (IST)

    దర్శి నగర పంచాయతీలో ప్రశాంతంగా పోలింగ్

    ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి తొలిసారి ఎన్నికలు జరగుతున్నాయి. మొత్తం 20 వార్డులు ఉండగా.. 8 వ వార్డు ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 19 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం బరిలో 77 మంది అభ్యర్థులు నిలిచారు.

    ఎన్నికల నిర్వహణకు 180 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వీరితోపాటు 24 మంది వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బంది, 22 మైక్రో అబ్జర్వర్లుగా పనిచేస్తారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. మోడల్‌స్కూల్లోని స్ర్టాంగ్‌ రూంలో ఉన్న బ్యాలెట్‌ బాక్సులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. వీటిని దర్శి నియోజకవర్గ ప్రత్యేకాధికారి కె. కృష్ణవేణి పర్యవేక్షణలో పోలింగ్‌ అధికారులకు అప్పగించారు.

  • 15 Nov 2021 09:35 AM (IST)

    బేతంచర్ల నగర పంచాయతీకి తొలి ఎన్నికలు

    కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని బేతంచర్ల మొదటిసారి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ స్థాయి కి ఎదిగింది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరి నిలబడ్డారు.

  • 15 Nov 2021 09:13 AM (IST)

    కాకినాడ మున్నిపల్ కార్పొరేషన్‌లో పోలింగ్ ప్రశాంతం

    తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నాలుగు వార్డులకు జరగుతున్న పోలింగ్ కోసం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరికిరణ్ పర్యవేక్షిస్తున్నారు.

  • 15 Nov 2021 09:06 AM (IST)

    పదకొండేళ్ల తర్వాత రాజంపేట మున్సిపాలిటీకి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు

    కడప జిల్లా రాజంపేట, కమలాపురంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా ఓటర్లు పోలింగ్ బూతుల వద్దకు చేరుకుంటున్నారు. తొలిసారి కమలాపురం మున్సిపాలిటీ, పదకొండేళ్ల తర్వాత రాజంపేట మున్సిపాలిటీకి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి..

  • 15 Nov 2021 09:04 AM (IST)

    కడప జిల్లాలో ఉదయం 8గంటల వరకు నమోదైన పోలింగ్

    Kadapa Polling

    Kadapa Polling

  • 15 Nov 2021 09:04 AM (IST)

    ఓటు వేసిన ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి

    కమలాపురం మున్సిపాలిటీలో  స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీస్తుంది. కమలాపురంలో 20స్దానాలలో భారీ మెజారిటీతో గెలుస్తామని రవీంద్రనాధ్ రెడ్జి ధీమా వ్యక్తం చేశారు. న్యాయబద్దంగా ఎన్నికలకు వెళుతున్నామన్న ఎమ్మెల్యే.. టీడీపీ నేతలు రౌడీ షీటర్లను, కేసులు ఉన్నోళ్ళను ఏజెంట్లుగా కూర్చోబెట్టారని ఆరోపించారు.

  • 15 Nov 2021 08:59 AM (IST)

    గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్

    గుంటూరు జిల్లాలోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అలాగే, గుంటూరు కార్పోరేషన్ పరిధిలోని ఆరో డివిజన్ కు, రేపల్లే మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డుకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో 25 సమస్యాత్మక, అత్యంత్య సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 15 Nov 2021 08:43 AM (IST)

    నెల్లూరు కార్పొరేషన్‌‌లో కొనసాగుతున్న పోలింగ్

    నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో పోలీంగ్ ప్రశాంతంగా కొనసాగనుంది. మొత్తం 54 డివిజన్లు ఉండగా వాటిలో ఏకగ్రీవమైనవి మినహా మిగిలిన 46 డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. అధికార యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • 15 Nov 2021 08:13 AM (IST)

    బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో కొనసాగుతున్న పోలింగ్

    బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికల బరిలో 79 మంది అభ్యర్థులు ఉన్నారు. 38 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 400 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 45,463 మంది ఓట హక్కు వినియోగించుకోనున్నారు.

  • 15 Nov 2021 07:53 AM (IST)

    కుప్పం మున్సిపాలిటీ ముఖచిత్రం..

    కుప్పం మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 25. మొత్తం ఓటర్లు - 39,259 మంది. పురుషులు - 19,342. స్త్రీలు - 19905. ట్రాన్స్ జెండర్స్ - 12 మంది. 48 పోలింగ్ కేంద్రాలు. 9 సమస్యాత్మక కేంద్రాలు. విధుల్లో 600 మంది పోలీసులు. 14వ వార్డు ఏకగ్రీవం. 24 వార్డులకు జరుగుతున్న పోలింగ్. బరిలో 87 మంది అభ్యర్థులు. పోలింగ్ సిబ్బంది 300 మంది.

  • 15 Nov 2021 07:51 AM (IST)

    పోలింగ్ కు సిద్ధమైన కుప్పం

    చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు చేరుకుంటున్నారు. భారీగా పోలింగ్ జరిగేలా చూడాలని తెలుగు దేశం పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కుప్పం నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కుప్పంలో పర్యటించేందుకు చంద్రబాబు సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నారు.

  • 15 Nov 2021 07:48 AM (IST)

    ఓటు కోసం బారులు తీరుతున్న జనం

    కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటేసేందుకు జనం బారులు తీరారు.

  • 15 Nov 2021 07:46 AM (IST)

    కోవిడ్ నిబంధనల నడుమ పోలింగ్ షురూ

    నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1,206 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్‌ సమయంలో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

  • 15 Nov 2021 07:45 AM (IST)

    కుప్పం ఎన్నికలకు భారీ బందోబస్తు

    కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది. 39, 261 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 48 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published On - Nov 15,2021 7:42 AM

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..