AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్‌.. ఏపీ, తెలంగాణలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్!

వరుణుడు దక్షిణాది రాష్ట్రాలపై పగబట్టినట్టే ఉంది పరిస్థితి. వారం రోజులుగా నీటిలో నానుతున్న తమిళనాడు కోలుకోక ముందే, మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. .

Weather: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్‌..  ఏపీ, తెలంగాణలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్!
Heavy Rainfall
Balaraju Goud
|

Updated on: Nov 15, 2021 | 9:53 AM

Share

Weather updates Today: వరుణుడు దక్షిణాది రాష్ట్రాలపై పగబట్టినట్టే ఉంది పరిస్థితి. వారం రోజులుగా నీటిలో నానుతున్న తమిళనాడు కోలుకోక ముందే, మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మరి కొద్ది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఒక ద్రోణి, ఉత్తర అంతర్గత తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి, గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బెంగాల్ వరకు ఆంధ్ర, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కోస్టల్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. ఐఎండీ వార్నింగ్‌తో అప్రమత్తమైంది తెలంగాణ సర్కార్‌. రానున్న వర్షాల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 4వేల 39 ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో యుద్ధప్రతిపాదికనగా వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కేసీఆర్ సర్కారు. అటు ఏపీలోనూ అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఊర్లలో చాటింపు వేయించి అలెర్ట్‌ చేశారు పోలీసులు. అటు తమిళనాడు, కేరళ, ఒడిశాలోనూ అధికారులను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు ఆయా రాష్ట్రాల అధికారులు. Read Also….  Corona Virus: కరోనా వైరస్‌తో యూరోపిన్ దేశాలు విలవిల.. టీకాలు కూడా వ్యాప్తిని ఆపలేదంటున్న డబ్ల్యూహెచ్‌ఓ..