Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR University: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో ఎక్కడున్నావ్.. బాలయ్యకు మంత్రి జోగి స్ట్రాంగ్ కౌంట్..

NTR University:హెల్త్‌ వర్శిటీ పేరు మార్పుపై రాజకీయ కాక కంటిన్యూ అవుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్టీఆర్ వారసులు మొదలు,

NTR University: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో ఎక్కడున్నావ్.. బాలయ్యకు మంత్రి జోగి స్ట్రాంగ్ కౌంట్..
Jogi Ramesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2022 | 7:54 PM

NTR University:హెల్త్‌ వర్శిటీ పేరు మార్పుపై రాజకీయ కాక కంటిన్యూ అవుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్టీఆర్ వారసులు మొదలు, టీడీపీ నేతలు, అభిమానులు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తుతున్నారు. పంచ భూతాలున్నాయి తస్మాత్ జాగ్రత్త అని బాలయ్య వైసీపీకి వార్నింగ్ ఇస్తే.. అధికార పార్టీ నుంచి అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్లు పడ్డాయి. మీ తండ్రికి వెన్నపోటు పొడిచినప్పుడు ఏమయ్యారని ప్రశ్నలు సంధించారు మంత్రి జోగి రమేష్‌. తామొచ్చాక పేరు మార్చడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రకటించగా.. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ కోసం ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి విడదల రజని. పేరు మార్పు సరికాదని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అంటే.. ఎన్టీఆర్‌పై తమకే ఎక్కువ గౌరవం ఉందన్నారు మంత్రి వేణు. ఇలా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ పేరు మార్పుపై రాజకీయ కాక రోజు రోజుకు పెరుగుతోంది.

బాలయ్య వర్సెస్ మంత్రి..

లేటుగా వచ్చినా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ. హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడటంపై బాలకృష్ణ రియాక్షన్‌ పొలిటికల్‌ హీట్‌ను ఒక్కసారిగా పెంచేసింది. చాలా ఘటు కామెంట్లే చేశారాయన. ‘మార్చేయటానికీ, తీసేయటానికి NTR అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనక్కి ఎయిర్‌పోర్ట్‌ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచ భూతాలున్నాయ్‌ తస్మాత్‌ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్‌. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’ అంటూ సంచలన ప్రకటన చేశారు బాలకృష్ణ.

ఇవి కూడా చదవండి

ఈ స్టేట్‌మెంట్‌పై అంతే సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు మంత్రి జోగి రమేష్‌. శునకాలు అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. 3 రోజుల తరువాత బాలకృష్ణ స్పృహలోకి వచ్చినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్‌ను ఈ జాతి నుంచి దూరం చేసిందెవరు? అని ప్రశ్నించారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిందెవరు? పార్టీని, ట్రస్ట్‌ను లాక్కుని, సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా? అప్పుడు బాలకృష్ణ ఏం చేశారు? శునకం ఎవరు? ఆ శునకానికి తోక ఎవరు? చంద్రబాబుకు బుద్ధి చెప్పండి అన్న ఎన్టీఆర్ చివరి కోరికను మీరు నెరవేర్చలేదు. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకులు తిన్నదెవరు? ఎన్టీఆర్‌ను కూలదోసినప్పుడు బాలకృష్ణ నవ్వుతూ ఆనందించారు. అయినా మీ కూతురును ఆయన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. సినిమాల్లోనే నువ్ హీరోవి. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే బాలకృష్ణ ట్వీట్‌ చేశారు.’ అని ఘాటైన పదజాలంతో తీవ్రంగా విమర్శించారు మంత్రి జోగి రమేష్.

బుచ్చయ్య చౌదరి వర్సెస్ విడదల రజని..

మరోవైపు తామొచ్చాక వైసీపీ రంగుల్ని, ఆ పార్టీ పెట్టిన పేర్లను తీసేస్తామన్నారు టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. అధికారంలో ఉండగా ఎన్టీఆర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..