Balineni on Revanth: చంద్రబాబు ఏం చెబితే రేవంత్ అదే చేస్తాడు.. తెలంగాణ పీసీసీ చీఫ్‌పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అమరావతి రాజధానిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Balineni comments on Revanth: అతనొక క్యారెక్టర్ లెస్ ఫెలో.. అతని గురించి మాట్లాడేముంటుందంటూ.. అతనికంటూ ఎజెండా లేదు.. ఎవరో ఎదో చెబితే.. అతని చేస్తాడు.. ఇది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలు.. అమరావతి రాజధానిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలుగు కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే రేవంత్ చెబుతారన్నారు.
అయనకో పార్టీ అంటూ ఏమీ లేదని మంత్రి బాలినేని ధ్వజమెత్తారు. అమరావతి గురించి ఆయనకు ఎందుకని మంత్రి బాలినేని ఎదురు ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ది చెందుతున్న ప్రాంతం కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నామని మంత్రి బాలినేని మరోసారి స్పష్టం చేశారు. ఓ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీ అధినేత ఇష్టమంటాడు. అయనకో పార్టీ లేదు… కాంగ్రెస్‌లో ఉంటాడు.. చంద్రబాబు ఇష్టం అంటాడు.. అదీ ఆయన క్యారెక్టర్ అని మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విలువలతో కూడిన రాజకీయ నాయకులను మాత్రమే ప్రజలు ఆదరిస్తారన్నారు.
ఇదిలావుంటే, ఏపీ రాజధాని అమరావతి గందరగోళంగా మారడం తెలంగాణవాదిగా సంతోషం కలిగిస్తోందని, కానీ.. భారత పౌరుడిగా బాధగా ఉందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటేనే ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కామెంట్స్‌పై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Puri Jagannath Temple: ఇవాళ తెరుచుకున్న పూరీ జగన్నాథుడి ఆలయం.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే..?