ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. రిపీటెడ్ అంశాలు వాదించవద్దని లాయర్లకు హితవు.. తదుపరి విచారణ వాయిదా..

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి అసెంబ్లీ, మండలి ప్రొసీడింగ్స్ కోర్టుకి అందించారా అని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది?

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. రిపీటెడ్ అంశాలు వాదించవద్దని లాయర్లకు హితవు.. తదుపరి విచారణ వాయిదా..
Follow us
uppula Raju

|

Updated on: Nov 26, 2020 | 8:00 PM

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి అసెంబ్లీ, మండలి ప్రొసీడింగ్స్ కోర్టుకి అందించారా అని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది? అయితే ఆడియో, వీడియో క్లిప్స్ అందజేస్తున్నామని అసెంబ్లీ కౌన్సిల్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

స్పీకర్ సంతకం తర్వాత మాత్రమే ఇవ్వాల్సిన బ్లూ బుక్స్‌కు కొంత సమయం కావాలని కోర్టు వారిని కోరారు. ఎందుకంటే స్పీకర్ అందుబాటులో లేరని తెలిపారు. అయితే 3 రాజధానుల అంశంపై చట్టం చేయటానికి అసెంబ్లీకి అధికారం లేదని రైతుల తరపు న్యాయవాది వాదించారు. కేంద్రం, చట్టాల ప్రకారమే అమరావతి రాజధాని నిర్ణయం జరిగిందని, ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చే అవకాశం ఉండదని కౌన్సిల్ తరపు న్యాయవాది వాదించారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాదులు రిపీటెడ్ అంశాలపై కాకుండా కొత్త విషయాలను వాదనల రూపంలో తెలపాలని హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.