Chintamani Natakam: చింతామణి నాటకం నిషేధించడంపై హైకోర్టులో విచారణ.. ప్రతివాదులకు నోటీసులు జారీ..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకం(Chintamani Natakam) నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకం(Chintamani Natakam) నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో(AP High Court) విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం(High Court of AP) ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(MP Raghurama Krishna Raju) వేసిన ఈ పిటిషన్‌పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అదే సమయంలో నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంప్లీడ్ పిటిషన్లపైనా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 100, 200 పిటిషన్లు వేస్తారా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. విచారణను సాగదీసేందుకే ఈ ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా అని ప్రశ్నించింది హైకోర్టు.
సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. తాము కేవలం అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టు్కు తెలిపారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించారు. కన్యాశుల్కం నాటకములో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా అని ప్రశ్నించారు న్యాయవాది. అలాగే రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించమంటే ఎలా అని ప్రశ్నించారు న్యాయవాది ఉమేష్. 100 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు. ఆర్టిస్టుల తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి బదిలీ అయ్యింది. వాదనలను విన్న ధర్మాసనం.. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Also read:
సలలిత రాగసుధారసాన్ని పంచిన సుస్వరాల సుసర్ల.. లతాను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే!