SEBI Officer Grade A 2022: ఫిబ్రవరి 20న జరగనున్న సెబీ 2022 గ్రేడ్‌ ఏ పరీక్షకు హాల్‌ టికెట్లు విడుదల..

సెక్యూరిటీస్ అండ్‌ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆఫీసర్ గ్రేడ్ A ఫేజ్‌ I - 2022 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. పరీక్ష రోజున..

SEBI Officer Grade A 2022: ఫిబ్రవరి 20న జరగనున్న సెబీ 2022 గ్రేడ్‌ ఏ పరీక్షకు హాల్‌ టికెట్లు విడుదల..
Sebi Admit Cards
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 09, 2022 | 3:03 PM

SEBI Officer Grade A Phase I Admit Cards 2022: సెక్యూరిటీస్ అండ్‌ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆఫీసర్ గ్రేడ్ A ఫేజ్‌ I – 2022 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఆఫీసర్ గ్రేడ్ ఏ (Assistant Manager Posts) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్‌ sebi.gov.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 8 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఇక సెబీ ఆఫీసర్ గ్రేడ్ ఫేజ్ I పరీక్ష ఫిబ్రవరి 20న జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను పరీక్షాకేంద్రాలకు తీసుకెళ్లవల్సి ఉంటుంది. లేదంటే లోపలికి ప్రవేశం ఉండదు.

సెబీ ఆఫీసర్ గ్రేడ్ ఏ 2022 అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • మొదట అధికారిక వెబ్‌సైట్ sebi.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్ పేజ్‌లో కెరీర్‌ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • సెబీ ఆఫీసర్ గ్రేడ్ ఎ అడ్మిట్ కార్డ్ 2022 లింక్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ లింక్‌పై క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ప్రదర్శించబడుతుంది.
  • అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

కాగా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 120 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ కానున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 5న ప్రారంభమై, అదేనెల 24న ముగిసింది. ఇతర సమాచారం కోసం అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

Also Read:

కేంద్ర పోర్టులు షిప్పింగ్ జలరవాణా విభాగంలో మొత్తం10,208 ఖాళీలు.. అప్పటి వరకు ఎదురుచూపే!