LSAT India 2022 January Results: లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ జనవరి సెషన్ 2022 ఫలితాలు విడుదల.. ఈ సారి ఎన్ని స్కాలర్‌షిప్పులంటే..
లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (LSAT India 2022) జనవరి సెషన్ 2022 ఫలితాలు బుధవారం (ఫిబ్రవరి9) విడుదలయ్యాయి...
LSAT India 2022 January Session Results: లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (LSAT India 2022) జనవరి సెషన్ 2022 ఫలితాలు బుధవారం (ఫిబ్రవరి9) విడుదలయ్యాయి. జనవరి సెషన్ పరీక్షకు మొత్తం 1689 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అధికారిక వెబ్‌సైట్ www.discoverlaw.inలో అభ్యర్ధులు లాగిన్ వివరాలను నమోదుచేయడం ద్వారా స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండవ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు వివిధ స్లాట్‌లలో మే 9 నుంచి ప్రారంభమవుతాయి. ఎల్‌శాట్ ఇండియా 2022 మే సెషన్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుంది.
కాగా ఈ ఏడాది 50 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు LSAT-India 2022లో మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేయనున్నట్టు లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ ఈ సందర్భంగా పేర్కొంది. LSAC గ్లోబల్ ప్రకటించిన ఎస్సే కాంపిటీషన్‌లో విన్నింగ్ ఎంట్రీలను సబ్‌మిట్ చేసిన విద్యార్థులకు అదనంగా 3 స్కాలర్‌షిప్‌లు అందించబడతాయి. ఈ స్కాలర్‌షిప్‌లు ఏదైనా LSAC గ్లోబల్ లా అలయన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే LSAT- భారత పరీక్ష రాసేవారికి అందుబాటులో ఉంటాయని కౌన్సిల్ తెల్పింది. ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్ధులు https://www.discoverlaw.in/scholarship-opportunities ను సందర్శించవచ్చు.
Also Read: