ICAI CA December 2021 Results: నేడో.. రేపో.. సీఏ ఫైనల్, ఫౌండేషన్ 2021 ఫలితాలు! ఆ వెబ్‌సైట్లలో మాత్రమే..
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI).. చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫైనల్ (old course and new course), ఫౌండేషన్ పరీక్షల ఫలితాల (CA foundation results)ను గురువారం సాయంత్రం (ఫిబ్రవరి 10) లేదా శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది..
ICAI CA foundation and final results 2021: చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI).. చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫైనల్ (old course and new course), ఫౌండేషన్ పరీక్షల ఫలితాల (CA foundation results)ను గురువారం సాయంత్రం (ఫిబ్రవరి 10) లేదా శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు వెబ్‌సైట్ www.icai.nic.in, www.careresults.icai.org లేదా www.icaiexam.icai.orgల ద్వారా ఫలితాలను తనిఖీచేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లలో ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్‌ను వారి రోల్ నంబర్‌తో పాటు నమోదు చేయవల్సి ఉంటుంది.
ఈ మెయిల్ ద్వారా ఫలితాలు పొందాలంటే.. ఫైనల్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ఈ మెయిల్ ద్వారా పొందాలనుకునే వారు www.icaiexam.icai.org వెబ్‌సైట్‌లో అభ్యర్ధుల వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందుకోవచ్చు. ఈ విధంగా మంగళవారం (ఫిబ్రవరి 8) నుంచి నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థనలు చేసుకున్న వారందరికీ ఫలితాలు ప్రకటించిన వెంటనే వారి వారి ఇ-మెయిల్‌లకు ఫలితాలు పంపించడం జరుగుతుంది. ఫలితాలకు సంబంధిత అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్‌ను తరచూ తనిఖీ చేస్తూ ఉండవల్సి ఉంటుంది.
Also Read: