Technical Assitant Jobs: బీటెక్ నిరుద్యోగులకు బంపరాఫర్! 100 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) కి చెందిన హ్యూమన్ రీసోర్సెస్ (HR Section) సెక్షన్‌లో టెక్నికల్ అసెస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
IISC Bangalore Technical Assitant Recruitment 2022: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) కి చెందిన హ్యూమన్ రీసోర్సెస్ (HR Section) సెక్షన్‌లో టెక్నికల్ అసెస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 100
ఖాళీల వివరాలు: టెక్నికల్ అసెస్టెంట్
పే స్కేల్: నెలకు రూ.21,700లతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
అర్హతలు: బీఈ/బీటెక్/బీఆర్క్/బీఎస్సీ/బీసీఏ/బీవీఎస్సీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 28, 2022 నాటికి 26 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (సీబీటీ)లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు: రూ.500
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: