AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్పపీడనం.. మరికొన్ని రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో 25 నుంచి..

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనివల్ల ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 27న వాయుగుండం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను తాకే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది.

అల్పపీడనం.. మరికొన్ని రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో 25 నుంచి..
Andhra Pradesh Heavy Rains
SN Pasha
|

Updated on: Sep 23, 2025 | 6:58 AM

Share

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇదే కాకుండా ఈ నెల 25న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ నెల 27న వాయుగుండం దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. కాగా నేడు, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేడు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు..

అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత