Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెలలోనే వారందరికీ..

ఉద్యోగులకు ఇవాల్సిన ప్రయోజనాలపై ఇప్పటికే వారి నుంచి వివరాలు తీసుకున్న ఏపీ సర్కార్‌... వాటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తాజా ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఏప్రిల్‌ నెలలోనే జీవో జారీ చేయనున్నట్టు సీఎం జగన్‌ హామీ

Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెలలోనే వారందరికీ..
Andhra Pradesh CM YS Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 21, 2023 | 6:13 AM

ఉద్యోగులకు ఇవాల్సిన ప్రయోజనాలపై ఇప్పటికే వారి నుంచి వివరాలు తీసుకున్న ఏపీ సర్కార్‌… వాటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తాజా ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఏప్రిల్‌ నెలలోనే జీవో జారీ చేయనున్నట్టు సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున.. ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట రామిరెడ్డి తెలిపారు. ఇందులో పెండింగ్ డీఏల విడుదలతో పాటు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అంశాలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. వీటిపై సీఎం జగన్ కీలక హామీలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని కోరగా ఈ నెలలో డిఏ ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెంకట రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతించాలని కోరగా మే నెలలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారన్నారు.

మరోవైపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా వచ్చే నెలలో జరిగే సాధారణ బదిలీలలో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెంకట రామిరెడ్డి వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఇటీవలే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకంలో మరో 46 రకాల క్యాన్సర్ చికిత్స విధానాలను శాశ్వతంగా చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న వేళ.. తాజా జగన్ ఇచ్చిన హామీలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..