Andhra: వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాల్లోకి రూ. 15 వేలు
దసరా పండుగ వేళ ఏపీలోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్త్రీ శక్తి అమలు చేస్తున్నందన తమకు ఇబ్బంది కలుగుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారికి ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం గొప్ప స్కీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ దసరా వేడుకల్లో అర్హులైన ఆటో రిక్షా, మాక్సి క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో మొత్తం రూ. 435.35 కోట్లు జమ చేయనుంది. ఈ సాయం 2,90,234 మంది డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి రూ.15,000 చొప్పున అందుతుంది. స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు వచ్చే ఆదాయం కోతలను తీరుస్తూ వారి కుటుంబాల ఆర్థికంగా అండగా నిలబడటం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రారంభోత్సవం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరగనున్నది, అందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
కాగా 2,25,621 మంది ఆటో డ్రైవర్లు, 38,576 త్రీ వీలర్ ప్యాసింజర్ వాహన డ్రైవర్లు, 20,072 మోటార్ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు ఈ పథకం ద్వారా రూ.15,000 సాయం పొందనున్నారు. గతంలో స్త్రీ శక్తి పథకం అమలు వల్ల ఆటో డ్రైవర్లకు వాహన యజమానుల ఆదాయం తగ్గింది. అలాగే రిపేర్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరిగిన పరిస్థితుల్లో ఈ ఆర్థిక సాయం వారికి ఉపయోగపడనుంది. ఇక వాహన యజమానుల కోసం గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గించారు. గతంలో రూ.20,000 ఉండిన గ్రీన్ ట్యాక్స్ ఇప్పుడు రూ.3,000కు తగ్గించారు.
అర్హుల జాబితాలో పేరు లేని ఆటో డ్రైవర్లు వెంటనే దరఖాస్తు చేసి అర్హత ధృవీకరణ పొందవచ్చు. ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. సాయం పొందాలంటే డ్రైవర్లకు ఏపీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ పథకం ద్వారా ఏపీ ఆటో డ్రైవర్లు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు ఉపశమనం పొందనున్నారు, అలాగే వారి కుటుంబాలకు సులభతరం కలిగే అవకాశాన్ని ప్రభుత్వం అందిస్తోంది.




