AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వచ్చే మూడు నెలల్లో 20 జాబ్ నోటిఫికేషన్లు! మారనున్న గ్రూప్-2 సిలబస్..

ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు జగన్‌ సర్కార్ తీపికబురు అందించనుంది. వచ్చే మూడు నెలల సమయంలో 20 ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన గ్రూపు-1లో 111 పోస్టులకు సంబంధించి నియామక పూర్తి ప్రక్రియను అగస్టు చివరి కల్లా..

AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వచ్చే మూడు నెలల్లో 20 జాబ్ నోటిఫికేషన్లు! మారనున్న గ్రూప్-2 సిలబస్..
APPSC Notifications
Follow us
Srilakshmi C

|

Updated on: May 04, 2023 | 12:52 PM

ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు జగన్‌ సర్కార్ తీపికబురు అందించనుంది. వచ్చే మూడు నెలల సమయంలో 20 ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన గ్రూపు-1లో 111 పోస్టులకు సంబంధించి నియామక పూర్తి ప్రక్రియను అగస్టు చివరి కల్లా పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్దం చేస్తున్నారు. ఇక గ్రూప్‌ 4 ఫలితాలను మే 3వ వారంలోగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇక కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్ల గురించి కసరత్తు జరుగుతోంది. గ్రూప్‌-1లో ఈసారి 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూపు 2లో దాదాపు 1000 పోస్టులకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. వీటితో పాటు 400 డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించి పోస్టుల విషయంలో ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే నోటిఫికేషన్ జారీ చేసే విధంగా ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లకు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గ్రూపు 2 సిలబస్‌లోనూ మార్పులు

ఏపీపీఎస్సీ గ్రూపు 2 సిలబస్‌లోనూ మార్పులు చేస్తున్నారు. 35 శాతం వరకు సిలబస్ రిపీట్ కావటంతో కొత్త సిలబస్‌ను రూపొందిస్తున్నారు. పాత సిలబస్‌ ప్రకారం హిస్టరీకి, పాలిటికి చెరి 75 మార్కులు ఉంటే ఒక్క ఎకనామిక్స్‌కే 150 మార్కులు ఉండేవి. దీంతో ఎకనామిక్స్‌ను ప్రధాన సబ్జెక్ట్‌గా చదివిన వారితో పోల్చుకుంటే మిగిలిన వారికి పరీక్షలో న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉంది. దీంతో ఎకనామిక్స్‌ కూడా 75 మార్కులకు పరిమితం చేసి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి 75 మార్కులు కేటాయించారు. అలాగే ఇండియన్‌ సోసైటీ అనే కొత్త సిలబస్‌ను తీసుకొచ్చారు. ఇందులో సంక్షేమ పథకాల గురించి ఉంటుంది. రానున్న మూడు నెలల కాలంలో 20 నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్దం అవుతుండటంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌ ప్రారంభానికి సిద్ధమైపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.