AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP IAS Transfers: ఏపీలో 16 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

AP IAS Transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..

AP IAS Transfers: ఏపీలో 16 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Subhash Goud
|

Updated on: Jul 24, 2021 | 8:09 AM

Share

AP IAS Transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లాతో పాటు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇక పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్లను బదిలీ చేశారు.

* దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. అర్జునరావును ఏపీ స్టేట్‌ హ్యాండ్‌ లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇక దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తోన్న జి.వాణీమోహన్‌ను దేవదాయ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.

* విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ పి.కోటేశ్వరరావును కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డిని నియమించారు.

* తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌రెడ్డిని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు బదిలీ చేయగా, ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇక్కడ పని చేస్తోన్న విజయ్‌రామరాజును వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

* శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ను పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఏపీ స్టేట్‌ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సోసైటీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీగా పని చేస్తోన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

* వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌గా హరికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నికయమించారు.

* విశాఖ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వాడరేవు వినయ్‌చంద్‌ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియామకం అయ్యారు. ఇక్కడ పనిచేస్తోన్న డాక్టర్‌ ఎ.మల్లిఖార్జునను విశాఖ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

* ఇక పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఎం.ప్రభాకర్‌రెడ్డిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు.

* కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

* విజయనగరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ను ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా నియమించారు. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.సూర్యకుమారిని విజయ నగరం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఈమె స్థానంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండ్యన్‌ను నియమించారు.

ఇవీ కూడా చదవండి:

రెండో డిప్యూటీ మేయర్, రెండో వైఎస్ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్.. ఈ నెల 30న పురపాలికల ప్రత్యేక సమావేశం

Petrol, Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!