AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వీటిపై 75 శాతం రాయితీ!

Andhra Pradesh: ఏపీ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇక్కడి రైతులు పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది..

Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వీటిపై 75 శాతం రాయితీ!
Subhash Goud
|

Updated on: Aug 14, 2025 | 3:14 PM

Share

Andhra Pradesh: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇక్కడి రైతులు పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీ పశుసంవర్ధక శాఖ రాయితీతో కూడిన దాణా, గడ్డి విత్తనాలు, వ్యాక్సిన్లు అందిస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రభుత్వం రైతులకు త్వరలోనే రాయితీతో గడ్డి కోత యంత్రాలను అందించనుంది.

ఇది కూడా చదవండి: RBI: ఇక 2 రోజులు అక్కర్లేదు.. కేవలం గంటల్లోనే క్లియర్‌.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో కీలక మార్పు!

75 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు:

ఇక పాడి రైతుల కోసం పశుగ్రాసం 75 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 5 కిలోల గడ్డి విత్తనాలు ఉన్న బ్యాగ్ విలువ రూ.465 కాగా.. పశుసంవర్థక శాఖ పాడి రైతులకు దీనిని 75 శాతం రాయితీతో కేవలం రూ.115లకే అందిస్తోంది. అలాగే 50 శాతం రాయితీతో దాణా కూడా అందిస్తోంది. దీని కోసం ఏపీ రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. రాయితీల కోసం పశువుల ఆస్పత్రులలో అయితే ఆస్పత్రి వైద్యులను, రైతు సేవా కేంద్రాలలో ఏహెచ్‌ఏలను సంప్రదించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Viral Video: గజరాజుకు కోపం వస్తే ఎట్లుంటదో తెలుసా? రోడ్డుపై బీభత్సం.. వీడియో వైరల్‌

నట్టల నివారణ కోసం మందుల పంపిణీ

ఇక నట్టల నివారణ కోసం గొర్రెలు, మేకల కోసం మందులను పంపిణీ చేస్తోంది ఏపీ పశుసంవర్ధక శాఖ. ప్రైవేట్ దుకాణాలలో రూ.600 నుంచి రూ.1000 వరకూ ధర ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ మందులను ఉచితంగా అందిస్తోంది. పోషకాలతో కూడిన ఈ దాణా 50 కిలోల సంచి బహిరంగ మార్కెట్లో 1100 వరకూ ధర ఉండగా, 50 శాతం రాయితీతో రూ.550 లకే ప్రభుత్వం అందిస్తోంది.

ఇది కూడా చదవండి: ICICI: వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్‌.. అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పరిమితి తగ్గింపు!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి