ICICI: వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్.. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి తగ్గింపు!
ICICI Minimum Balance Rules: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌ను అత్యంత భారీగా పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు..

ICICI Minimum Balance Rules: పట్టణ ప్రాంతాల్లోని కొత్త కస్టమర్లకు కనీస సగటు బ్యాలెన్స్ (MAB) నిబంధనలను ICICI బ్యాంక్ పాక్షికంగా రూ.50,000 నుండి రూ.15,000కి తగ్గించింది. వినియోగదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావడంతో ఎట్టకేలకు కొన్ని రోజుల్లోనే వెనక్కి తగ్గింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటి పట్టణ ప్రాంతాల్లోని కొత్త కస్టమర్లకు MAB అవసరాన్ని రూ. 10,000 నుండి రూ. 50,000 కు పెంచిన కొన్ని రోజుల తర్వాత, కస్టమర్ల నుండి భారీ వ్యతిరేకత వచ్చిన తరువాత ఈ సవరణ వచ్చింది.
సవరించిన కనీస బ్యాలెన్స్ నియమం అవసరం ఇప్పటికీ మునుపటి దానికంటే రూ. 5,000 ఎక్కువ. సెమీ అర్బన్ ప్రాంతాల్లోని కొత్త ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లు నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్‌ను కూడా రూ.25,000 నుండి రూ.7,500కి తగ్గించారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో పాత కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ నియమాన్ని రూ.5,000 వద్దే ఉంచింది.
ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఈ లావాదేవీలపై ఛార్జీల మోత.. ఆగస్ట్ 15 నుంచి అమలు!
అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌ను అత్యంత భారీగా పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిర్ణయించుకోవడం పూర్తిగా బ్యాంకుల ఇష్టమంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Price: జోరు తగ్గింది.. 2400 రూపాయలు తగ్గిన బంగారం ధర
ఇది కూడా చదవండి: BSNL Best Plan: అతి తక్కువ ధరల్లోనే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








