SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఈ లావాదేవీలపై ఛార్జీల మోత.. ఆగస్ట్ 15 నుంచి అమలు!
SBI:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. మీరు రూ.25 వేలకు మించి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించినట్లయితే ఇకపై ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఐఎంపీఎస్ (IMPS) ఛార్జీలను సవరిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఎస్‌బీఐ. అయితే సవరించిన ఈ కొత్త ఛార్జీలు ఆగస్ట్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంక్ కస్టమర్లు ఆగస్టు 15, 2025 నుండి ఆన్‌లైన్ IMPS బదిలీపై రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో పూర్తిగా ఉచితం ఉండేది. ఇన్‌స్టంట్ మనీ పేమెంట్ సర్వీస్(IMPS) అనేది రియల్-టైమ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్. దీని సహాయంతో ఎవరైనా తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. ఈ సేవ 24 గంటలు 365 రోజులు అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో కొన్నింటికి కొత్త ఛార్జీలు విధిస్తుండగా, కొన్నింటికి ఎలాంటి మార్పులు చేయలేదని బ్యాంక్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Gold Price: జోరు తగ్గింది.. 2400 రూపాయలు తగ్గిన బంగారం ధర
IMPS ద్వారా ఒకేసారి గరిష్టంగా రూ.5 లక్షల వరకు బదిలీ చేయవచ్చు. SBI చేసిన మార్పు ఆన్‌లైన్ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుందని, కొన్ని స్లాబ్‌లలో నామమాత్రపు ఛార్జీలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. అయితే ఈ ఛార్జీలు ఇప్పటికీ కొన్ని ఖాతాలపై విధించడం లేదు. ఏ స్లాబ్‌పై బ్యాంక్ ఎంత ఛార్జీ విధించిందో తెలుసుకుందాం.
➦ రూ.25,001–రూ.1,00,000: రూ.2 + ప్రతి లావాదేవీకి GST
➦ రూ.1,00,001–రూ.2,00,000: రూ.6 +(GST)
➦ రూ.2,00,001–రూ.5,00,000: రూ.10 + (GST)
➦ ఇప్పటివరకు అన్ని ఆన్‌లైన్ IMPS లావాదేవీలు మొత్తంతో సంబంధం లేకుండా ఉచితంగా ఉండేవి.
ఈ లావాదేవీలలో మార్పులు లేవు:
SBI శాఖలలో చేసే IMPS బదిలీలకు రుసుములు అలాగే ఉంటాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. పంపిన మొత్తాన్ని బట్టి రూ.2 + GST నుండి రూ.20 + GST వరకు ఉంటాయి.
ఈ ఖాతాదారులకు మినహాయింపు
కొంతమంది కస్టమర్లు ఆన్‌లైన్ ఐఎంపీఎస్ కోసం అధిక మొత్తాలకు కూడా జీరో ఛార్జీలు ఉంటాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఇందులో రక్షణ, పారా-మిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర ప్రభుత్వం, పోలీసు, రైల్వే ఉద్యోగులకు మినహయింపు ఇచ్చింది.
ఈ మార్పు ఎందుకు?
బ్యాంక్ ప్రకారం.. ఈ నిర్ణయం ఎస్‌బీఐ ఆన్‌లైన్ IMPS ఛార్జీలను పరిశ్రమ నిబంధనలకు అనుగుణంగా మార్చింది. అదే సమయంలో రోజువారీ తక్కువ-విలువ కలిగిన బదిలీలు మెజారిటీ కస్టమర్లకు ఉచితంగా ఉండేలా చేసింది.
ఇది కూడా చదవండి: BSNL Best Plan: అతి తక్కువ ధరల్లోనే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








