AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips: మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా..? ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోండి!

మన జీవితం సాఫీగా సాగాలంటే కచ్చితంగా డబ్బు కావాలి. అంటే మనం ఏదో పనిచేసి డబ్బు సంపాధించాలి. అయితే మనం సంపాధించిన డబ్బును ఇంకా పెంచుకోవాలంటే.. పెట్టుబడులు పెట్టాలి. అయితే చాలా మందికి తమ డబ్బును ఎలా సరిగ్గా పెట్టుబడి పెట్టాలో తెలియదు. ఈ పరిస్థితిలో, కొందరు ఆర్థిక సలహాదారు డబ్బు పెట్టుబడి పెట్టడంలో మూడు కీలకమైన అంశాల గురించి సలహాలు ఇస్తున్నారు అవేంటో తెలసుకుందాం పదండి.

Investment Tips: మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా..? ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోండి!
Investment Tips
Anand T
|

Updated on: Aug 13, 2025 | 8:17 PM

Share

డబ్బు సంపాదించడమే కాదు, దానిని సరిగ్గా ఖర్చు చేయడం, పెట్టుబడి పెట్టడం కూడా చాలా ముఖ్యం.ఈ అలవాట్లే మన డబ్బును అనేక రెట్లు పెంచడంలో ప్రధాన అంశంగా ఉంటాయి. మీరు సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం లేదా పొదుపు అనే నెపంతో బ్యాంకు ఖాతాలో ఉంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందు. వాటిని నువ్వు రొటేషన్‌ చేస్తూ.. వాటి వల్ల నీ సంపాదనను మరింత పెంచుకుంటే, నీతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది. అందువల్ల, మీరు సంపాదించిన డబ్బులో కనీసం కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ పరిస్థితిలో, డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు అనుసరించాల్సిన మూడు విషయాలను వివరంగా పరిశీలిద్దాం.

చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం

చాలా మంది యువకులు ఈ మధ్య తమ ఉన్నత విధ్యను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అందులో చాలా మంది 20-25 ఏళ్ల మధ్య ఉంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ తమ 22 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుబడి పెట్టడం ప్రారంభించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి 22 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, అతను 55 సంవత్సరాల వయస్సు నాటికి దాదాపు రూ. 2 కోట్ల వరకు ఆదా చేయవచ్చని చెబుతున్నారు. అలా పెట్టుబడి పెట్టాలనుకునే వారు సంవత్సరానికి 12 శాతం రాబడిని ఇచ్చే పథకంలో తమ పెట్టుబడులను పెట్టాలి. మీరు 22 సంవత్సరాల వయస్సులో కాకుండా 30 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు రూ. 12,000 పెట్టుబడి పెట్టి 55 సంవత్సరాల వయస్సులోపు రూ. 2 కోట్లు పొందవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే.. మన వయస్సు పెరిగే కొద్ది.. పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది.

నిరంతర పెట్టుబడి

పెట్టుబడి విషయానికి వస్తే, మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే దానిని నిరంతరం కొనసాగించడం మంచింది. దీని వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. లేకపోతే, మనం పెట్టుబడి పెట్టడంలో అర్థం లేదు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఇప్పటి నుంచి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తే.. ప్రతి నెలా దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అలా కాదని మధ్యలో వదిలేస్తే..మీ ప్రయత్నం వృదా అవుతుంది.

స్వల్పకాలిక హెచ్చు తగ్గులకు భయపడవద్దు.

స్టాక్స్ మార్పులకు లోబడి ఉంటాయి. అవి కొన్నిసార్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటాయి. అటువంటి నష్టాలు సంభవించినప్పుడు, ఆర్థిక నష్టానికి భయపడి పెట్టుబడి పెట్టడం మానేయకూడదు. మీరు మీ పెట్టుబడులపై లాభాలో పొందేలా మరిని విషయాలను తెలుసుకొని వాటిని కొనసాగించాలి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు, ఆర్థిక నిపుణులు, నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ద్వారా అందించబడినవి. వీటిలో మీకు ఏవైనా సందేహాలు ఉండే.. మీకు అందుబాటులో ఉన్న ఆర్థిక నిపుణులను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.