ఉద్యోగులకు శుభవార్త.. ఆ సెలవులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగినులకు పిల్లల సంరక్షణకు ప్రస్తుతం ఇస్తున్న సెలవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 రోజుల నుంచి....
మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగినులకు పిల్లల సంరక్షణకు ప్రస్తుతం ఇస్తున్న సెలవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్(SS.Ravat) వివరాలు వెల్లడించారు. అయితే ఇద్దరి లోపు పిల్లలు ఉన్నవారికే ఈ అవకాశం వర్తిస్తుంది. అంతే కాకుండా ఒక ఏడాది లోపు వయసు ఉన్న వారిని దత్తత తీసుకున్నప్పుడు కూడా ఈ సెలవు ఇస్తారు. ఇలాంటి సందర్భాల్లో పురుష ఉద్యోగులకూ 15 రోజులు పెటెర్నిటీ లీవ్స్ ఇస్తారు. పెళ్లి చేసుకోని పురుషులు, భార్య మరణించిన వారికి, విడాకులు తీసుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. సెలవు కాలానికి జీతం వస్తుందని ఉత్తర్వుల్లో వివరించారు.
దత్తత తీసుకునే పిల్లల వయసు నెలరోజుల లోపు ఉంటే ఆ సెలవు ఏడాది పాటు కూడా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఆరు నుంచి ఏడు నెలల మధ్య వారయితే ఆరు నెలలు సెలవు తీసుకునే అవకాశం ఇచ్చింది. పిల్లల సంరక్షణకు తీసుకునే సెలవు.. తమ ఉద్యోగ కాలం మొత్తం మీద 180 రోజుల పాటు మహిళా ఉద్యోగులు తీసుకోవచ్చని పేర్కొంది. కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, క్షయ, కుష్టు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవు మంజూరు చేయడంతో పాటు.. ఆ సమయంలో ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను పెంచారు.
Also Read