AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉచిత హామీల కేసులో మా వాదనలు వినండి.. సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన వైసీపీ..

ఉచిత హామీల కేసుపై సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈకేసు విచారణ సందర్భంగా తమ వాదనలు వినాలని అత్యున్నత న్యాయస్థానంలో ఇంటెర్వీన్ పిటిషన్ దాఖలు కాగా..

Andhra Pradesh: ఉచిత హామీల కేసులో మా వాదనలు వినండి.. సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన వైసీపీ..
Vijayasaireddy
Amarnadh Daneti
|

Updated on: Aug 18, 2022 | 7:12 AM

Share

Andhra Pradesh: ఉచిత హామీల కేసుపై సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈకేసు విచారణ సందర్భంగా తమ వాదనలు వినాలని అత్యున్నత న్యాయస్థానంలో ఇంటెర్వీన్ పిటిషన్ దాఖలు కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దీనిని దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లుకు ఉచిత హామీలు ఇవ్వకుండా నిరోధించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఈసందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకుండా తాము అడ్డుకోలేమని తెలిపారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. అయితే ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో ఖర్చుచేయడమనేది దీనిలో ప్రధాన అంశంమని పేర్కొన్నారు. ఉచితాలంటే ఏంటో సరైన అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని.. దీనిపై లోతైన చర్చ జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈనెల 20వ తేదీ లోపు తమ సూచనలు, అభిప్రాయాలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు సూచనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేసి.. ఈకేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోరారు. గత మూడు రోజుల క్రితం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఉచితాలు కాదని.. అవి సోషల్ ఇన్వెస్టిమెంట్ కిందకు వస్తాయని వ్యాఖ్యానించారు. అసలు ఎటువంటి ఉద్దేశం లేకుండా.. ఓటర్లను ప్రలోభపెట్టడం కోసమే అమలు చేసే పథకాలను మాత్రమే ఉచితాలుగా పేర్కొనాలని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని.. వారి సమస్యలను తీరుస్తూ.. సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత కలిగిన పథకాలను ఉచితాలుగా చూడటం సరికాదన్నారు. ఈనేపథ్యంలో ఉచిత పథకాల హామీలపై దాఖలైన కేసులో తమ వాదనలు వినాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..