Antarvedi: లక్ అంటే ఈ జాలరిదే.. చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతంటే..?
కచిడి చేపను గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారంలానే విలువ కలిగి ఉంటుంది. జాలర్ల పంట పండిస్తుంది. కచిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఎప్పుడూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు ప్రయాణం చేస్తూనే ఉంటుంది.
చేపల వేట జాలర్లకు జీవనాధారం. నాటు పడవల్లో సముద్రంలోకి వెళ్లి.. చేపల పట్టి.. వాటిని ఒడ్డుకు తీసుకువచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. వలలో పెద్ద చేప పడిందంటే మత్స్యకారులకు పండగే. చేప చిన్నదైనా పులస లాంటి కాస్ట్‌లీదైతే మరీ హ్యాపీస్. సాధారణంగా వింత చేపలు, అరుదైన చేపలు జాలర్ల వలకు చిక్కితే ఆనందపడతారు. వాటిని చూసేందుకు జనం కూడా ఎగబడతున్నారు. ఇక మెడిసిన్‌లో ఉపయోగించే చేపలు కూడా అరుదైనా జాలర్ల వలకు చిక్కుతుంటాయి. అవి పడితే నక్క తోక తొక్కినట్లే. ముఖ్యంగా మగ కచిడి చేపలకు మార్కెట్‌లో ఓ రేంజ్ డిమాండ్ ఉంటుంది. వీటిని కొనేందుకు వ్యాపారులు పోటీ పడుతూ ఉంటారు.
తాజాగా విశాఖపట్నం జిల్లా మత్స్యకారుడికి లక్ కలిసివచ్చింది. కోనసీమ జిల్లాలోని అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్ఠ గోదావరిలో అరుదైన కచిడి చేప చిక్కింది. అది కూడా వలకు కాదండోయ్. చేపలు అప్పుడప్పుడూ నదిపై తేలుతూ ఈదుతూ ఉంటాయి. అలా 4 కిలోల బరువున్న నదిలో తేలుతూ వెళ్లడాన్ని గమనించిన మత్స్యకారుడు.. వెంటనే ఈదుకుంటూ వెళ్లి దాన్ని పట్టి ఒడ్డుకు తీసుకువచ్చాడు. దీన్ని వేలం వేయగా.. ఏకంగా 16 వేలకు అమ్ముడయ్యింది అంటే మాటలా చెప్పండి. దీంతో ఆ జాలరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారం అంతా చేపల వేటకు వెళ్తే వచ్చే సంపాదన ఒక్క చేపతో వచ్చిపడింది.
మగ కచ్చిడి చేపకు మహా డిమాండ్. దీన్ని గోల్డ్ ఫిష్ అని కూడా అంటారు. దీన్ని మందుల తయారీలో వాడతారు. ఈ రకం చేపలు రెండు కాకినాడ, అంతర్వేది దగ్గర మత్స్యకారుల వలకు చిక్కుతూ ఉంటాయి. చేప బరువును బట్టి దాని రేటు పెరుగుతూ పోతుంది. కొన్ని భారీ కచ్చిడి చేపలు లక్షలు పలికిన దాఖలాలు కూడా ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..