Andhra Pradesh: మాజీ చీఫ్ మళ్లీ చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారా? రాహుల్ పాదయాత్రే వేదిక కానుందా?
కొన్నాళ్లు రాజకీయాలకు పూర్తిగా దూరమై, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్..
కొన్నాళ్లు రాజకీయాలకు పూర్తిగా దూరమై, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్ అవుతారా? ఖద్దర్ ధరించి.. చక్రం తిప్పుతారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అందుకు నిదర్శనంగా తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ను చూపుతున్నారు. అవును, ఏపీ మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈనెల 14న రాహుల్ పాదయాత్ర తర్వాత రాజకీయాలపై చర్చించుకుందామని గ్రామస్తులతో జరిగిన సమావేశంలో చెప్పారు రఘువీరా. ముందుగా రాహుల్ పాదయాత్రలో మన ప్రాంతం నుంచి భారీగా వెళ్లి మన సంపూర్ణ మద్దతు తెలియజేద్దామని గ్రామస్తులతో అన్నారాయన. అంతేకాదు ఊళ్లోని దేవాలయం నుంచి రాహుల్ గాంధీకి ప్రసాదం అందిద్దామని గ్రామస్తులకు చెప్పారు. వారం పది రోజుల్లోనే రాజకీయాల ఎంట్రీపై ఒకటే నిర్ణయం తీసుకుందామని అనుచరులు, గ్రామస్తులతో రఘువీరా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధ్మాత్మికంగా తనకు ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. మడకశిర దేవస్థానంలో చేసిన..కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు రఘువీరారెడ్డి.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయమంత్రిగా, తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీనియర్ నేత నీలకంఠాపురం రఘువీరారెడ్డి. అయితే 2019 ఎన్నికలకు ముందే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.
మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సాదారణ రైతులగా గడుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా రఘువీరా చుట్టూ రాజకీయాలు చుట్టుముట్టాయి. రాహుల్ పాదయాత్రలో పాల్గొంటానని చెప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బాస్ ఈ బ్యాక్ అనే డైలాగులు మారుమోగుతున్నాయి. ఈ ప్రచారాలకు రాహుల్ పాదయాత్ర తర్వాత ఫుల్‌స్టాప్ చెబుతారా.. రీఎంట్రీ ఇస్తూన్నానంటూ సంచలన ప్రకటన చేస్తారో చూడాలిమరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..