Covid-19 Third Wave: విద్యార్థులకు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు.. అధికారులకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు

Third Wave: పండుగల సీజన్ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలుకావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆ రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ మొదలైపోయినట్లేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Covid-19 Third Wave: విద్యార్థులకు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు.. అధికారులకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు
Andhra Pradesh Schools
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 09, 2021 | 6:13 PM

Third Wave: పండుగల సీజన్ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలుకావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆ రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ మొదలైపోయినట్లేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో స్కూల్స్, కాలేజీలకు హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆగష్టు 16 వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కళాశాలలు ప్రారంభించిన దృష్టా గురువారం మంత్రి అదిమూలపు సురేష్, విద్యా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశo నిర్వహించారు. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ భయాలపై చర్చించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని కోవిడ్ పరిస్టితులను విశ్లేషిస్తూ.. ఇప్పటి వరకు వాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు,  ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్‌గా నమోదైన విద్యార్ధుల, ఉపాధ్యాయుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని మిగిలిన 7,388 మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉన్నట్లు అధికారులు వివరించారు. ఉపాధ్యాయులకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసెందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ స్పందిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల వాక్సిన్ లు అందుబాటులో వున్నాయని, ఉపాధ్యాయుల్లో వంద శాతం మందికి వాక్సిన్ ఒకేసారి వేయడానికి గాను ఆయా జిల్లాల్లో విద్యా శాఖ ఏ కేంద్రాన్ని ప్రతిపాదిస్తే అక్కడ వాక్సిన్ వేసేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి గాను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు ఆయా జిల్లా వైద్యాధికారిని సంప్రదిస్తే చాలని తెలియజేసారు. పాఠశాలల్లో విద్యార్ధులు సామాజిక దూరం పాటిస్తే, చాలావరకు కోవిడ్ వ్యాప్తిని నివారించవచ్చన్నారు.  ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP) తప్పక పాటించాలని అన్నారు.

Adimulapu Suresh

Adimulapu Suresh

ఈ సందర్భంగా ఉన్నత విద్యా సంస్థలైన విశ్వ విద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు వంటి వాటిలో సిబ్బందికి, విద్యార్థులకు కూడా వాక్సినేషన్ వేయించడానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి ఆదిమూలపు.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ను కోరారు. ఇందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ స్పందిస్తూ.. ఇప్పటికే అన్ని విద్యాసంస్థలలోని సిబ్బందికి వాక్సినేషన్ వేయించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని, ఈ ఆదేశాలను పునరుద్ఘాటిస్తామని తెలియజేసారు.

Also Read..

Samantha: తగ్గేదే..లే.. అటు యాడ్స్.. ఇటు సినిమాలతో దూసుకుపోతున్న సమంత.. ఆసక్తికర విషయాలు మీకోసమే!

భుజాలపై భార్యతో ఆసుపత్రి కోసం నాలుగు కిలోమీటర్ల నడక..పాపం..ఆ వృద్ధుడి ప్రయత్నం చివరికి ఎలా మారిందంటే?