Disha Bill: హోం శాఖ పరిశీల‌నలో ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ బిల్లు.. రాజ్యసభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన 'దిశ' బిల్లు - క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం..

Disha Bill: హోం శాఖ పరిశీల‌నలో ఆంధ్రప్రదేశ్ 'దిశ' బిల్లు..  రాజ్యసభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
Smruthi Irani
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 29, 2021 | 8:48 PM

Disha Bill – MP Vijayasai reddy – Union Minister Smriti Irani: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన ‘దిశ’ బిల్లు – క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను పరిశీలిన అనంతరం తమ అభిప్రాయాలను జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు గురువారం రాజ్యసభలో ఇరానీ ప్రకటించారు.

‘దిశ’ (క్రిమినల్‌ లా సవరణ) బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి 2020 జనవరి 21న తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు కేంద్ర మంత్రి ఇరానీ పేర్కొన్నారు. ఈ బిల్లుపై తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించామని ఆమె వెల్లడించారు.

అనంతరం తమ అభిప్రాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయాలు వెల్లడించారు.

Read also : Chittoor Murder : చిత్తూరు కలెక్టరేట్ అటెండర్ మృతిలో కొత్త ట్విస్ట్.. ప్రియుడి ప్రేమ కోసం భర్త గొంతు నులిమి..