Andhra Pradesh: ఆటో నుంచి జారిపడ్డ కరెన్సీ నోట్లు.. పిలిచినా పట్టించుకోని డ్రైవర్..

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌ప్లాజా వద్ద కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. శ్రీకాకుళం టు నరసన్నపేట రోడ్‌లో టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై ఆటో నుంచి రెండుసార్లు కరెన్సీ నోట్లు పడిపోయాయి.

Andhra Pradesh: ఆటో నుంచి జారిపడ్డ కరెన్సీ నోట్లు.. పిలిచినా పట్టించుకోని డ్రైవర్..
Currency Notes
Follow us

|

Updated on: Mar 05, 2023 | 12:46 PM

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌ప్లాజా వద్ద కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. శ్రీకాకుళం టు నరసన్నపేట రోడ్‌లో టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై ఆటో నుంచి రెండుసార్లు కరెన్సీ నోట్లు పడిపోయాయి. అన్నీ రూ. 500 నోట్లే ఉన్నాయి. టోల్‌ ప్లాజా చివరి బూత్‌ వద్ద ఒకసారి, దానికి వంద మీటర్ల దూరంలో మరోసారి కిందపడిపోయాయి కరెన్సీ నోట్లు. అయితే, నోట్లు పడిపోయిన విషయాన్ని గుర్తించిన టోల్‌ ప్లాజా సిబ్బంది.. ఆటో వెంట పరుగులు తీసి పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు డ్రైవర్‌.

రోడ్డు పై పడిన సుమారు రూ.88 వేలను కలెక్ట్ చేసి నరసన్నపేట పోలీసులకు అప్పజెప్పారు టోల్ ప్లాజా సిబ్బంది. అయితే, కావాలనే నోట్లను వెదజల్లారా లేదా పొరపాటున ఆటో నుండి జారీ పడ్డాయా అనేది మిస్టరీగా మారింది. అయితే.. పట్టభద్రులు, స్థానిక సంస్థల కోటాకి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచే డబ్బులు గానూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ఎవరిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..