Tirupati: తిరుమల వాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు..
తిరుపతి సరికొత్త హంగులను సమకూర్చుకుంటోంది. కొత్త సొబగులను అద్దుకుంటోంది. ఇప్పటికే స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెడుతుంది. తిరుపతి ప్రజలకు డబుల్ డెక్కర బస్సు అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్‌తో నడిచే బస్సు ఇది. ఈ నెల 18న సీఎం జగన్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. తొలి దశలో ఎనిమిది బస్సులను నడిపించాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భావిస్తోన్నారు.

Tirumala News: తిరుపతి సరికొత్త హంగులను సమకూర్చుకుంటోంది. కొత్త సొబగులను అద్దుకుంటోంది. ఇప్పటికే స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెడుతుంది. తిరుపతి ప్రజలకు డబుల్ డెక్కర బస్సు అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్‌తో నడిచే బస్సు ఇది. ఈ నెల 18న సీఎం జగన్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. తొలి దశలో ఎనిమిది బస్సులను నడిపించాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భావిస్తోన్నారు. ఇవ్వాళ ఈ బస్సు ట్రయల్ రన్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా తిరుపతి నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెడతామని అన్నారు.
దేశంలో హైదరాబాద్ తర్వాత, డబుల్ డెక్కర్ బస్సు కలిగిన మరో ఏకైన నగరం తిరుపతేన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో తిరుపతిని మరో ఎత్తుకు తీసుకెళ్లే చర్యల్లో భాగంగానే డబుల్ డెక్కర్ బస్సులు తీసుకుని రావడం జరిగిందన్నారు. రాష్ట్ర రవాణా శాఖ అధికారులతో చర్చించి, ఒకట్రెండు రోజుల్లో డబుల్ డెక్కర్‌ను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రయోగాత్మకంగా ఒకే బస్సును అందుబాటులోకి తెచ్చామన్నారు. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అంశాన్ని నగర పాలక సంస్థ పరిశీలిస్తుందని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు.
స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతితో ఇప్పటికే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. త్వరలో ఇది వాహనదారులకు అందుబాటులోకి రానుంది. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం శ్రీనివాస సేతు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లైఓవర్ మంజూరయింది. ఈ నెల 18వ తేదీన సీఎం జగన్ ఈ వంతెనను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు ఈ బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..