Andhra Pradesh: నాడు నీ వెంటనే అన్నారు.. నేడు నీవెరో అంటున్నారు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బిగ్ షాక్..
శ్రీధరన్న ఆదేశిస్తే మేయర్ పదవికి కూడా రాజీనామా చేస్తా.. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరమైనప్పుడు మేయర్ స్రవంతి చెప్పిన మాటలివి. అక్కడ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు ఆ అన్నకే షాకిచ్చారు ఆమె. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి అనుబంధంగా మారిన నేపథ్యంలో..

Andhra Pradesh: శ్రీధరన్న ఆదేశిస్తే మేయర్ పదవికి కూడా రాజీనామా చేస్తా.. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరమైనప్పుడు మేయర్ స్రవంతి చెప్పిన మాటలివి. అక్కడ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు ఆ అన్నకే షాకిచ్చారు ఆమె. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి అనుబంధంగా మారిన నేపథ్యంలో మేయర్ స్రవంతి తన భర్త జయవర్థన్‌లు కోటంరెడ్డికి మద్దతుగా నిలిచారు. అవసరమైతే వైసీపీకి, మేయర్ పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. కానీ టీడీపీలో మాత్రం చేరలేదు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్ పొట్లూరి స్రవంతి దంపతులు తిరిగి వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
వాస్తవానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీకి దూరమైన తర్వాత కార్పొరేటర్లంతా టీడీపీవైపు వచ్చేస్తారని అనుకున్నారు. కానీ మొదటిరోజే కొంతమంది ఆయనకు హ్యాండిచ్చారు. బిల్లులు రావాల్సి ఉందని, అవి క్లియర్ చేసుకున్న తర్వాత ఆయనవైపు వస్తామని సర్దిచెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా వారు ఇటువైపు రాలేదు. కోటంరెడ్డి స్వయంగా సహాయం చేసి, రాజకీయంగా పెంచి పోషించినవారు కూడా ఆయనకు హ్యాండిచ్చారు. ఆదాల వైపు సర్దుకున్నారు. ఇప్పుడు మేయర్ స్రవంతి కూడా కోటంరెడ్డి వర్గం నుంచి దూరంగా జరగడం ఆయనకు పెద్ద షాకేనని చెప్పాలి. నెల్లూరు మేయర్ స్రవంతి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఎంపీ ఆదాల.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..