AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రధాని మోడీ సమీక్ష.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏపీ సీఎం తీసుకున్న చొరవ అభినందనీయం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.

AP CM YS Jagan: వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రధాని మోడీ సమీక్ష.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్
Ap Cm Jagan
Balaraju Goud
|

Updated on: Jan 22, 2022 | 3:14 PM

Share

pm modi to interact with DMs: వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏపీ సీఎం తీసుకున్న చొరవ అభినందనీయం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యువ అధికారులను సుదీర్ఘకాలం నియమించి జిల్లాల అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. సెలవు రోజు సైతం ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకావడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రధాని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతోనే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో పలు జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ జిల్లాల అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలను తొలగించాలని, సాంకేతికత, సృజనాత్మకతతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్దిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు కీలక దిశానిర్ధేశం చేశారు. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. తమ జిల్లాల్లో ప్రగతిని వివిధ జిల్లాల కలెక్టర్లు వివరించారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎస్‌ సమీర్‌ శర్మ సహా తదితతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Read Also….  Budget 2022: సుజీత్ లాంటి వారి నిరుద్యోగం ఇతరులపై ఎలా ప్రభావం చూపిస్తుంది..? బడ్జెట్ స్పెషల్ వీడియో..