CM Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు వరాలు.. వారికి ఉచిత బస్సు ప్రయాణం!
CM Chandrababu: సంవత్సరానికి రూ.6వేల కోట్లు పెన్షన్ రూపంలో అందిస్తున్నామని, బ్యాక్ లాగ్ పోస్టులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ పొడిగిస్తున్నామని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా వైకల్యం అడ్డుకాదని ఎంతో మంది నిరూపించారన్నారు. అలాంటి ఆదర్శవంతులను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే...

CM Chandrababu: దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని, కేవలం ఏపీలోనే మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని, 63 లక్షల 50వేల మందికి ప్రతి నెలా 1వ తేదీన ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దివ్యాంగులపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్ ఇదని పేర్కొన్నారు. వివిధ రకాల ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.
అలాగే సంవత్సరానికి రూ.6వేల కోట్లు పెన్షన్ రూపంలో అందిస్తున్నామని, బ్యాక్ లాగ్ పోస్టులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ పొడిగిస్తున్నామని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా వైకల్యం అడ్డుకాదని ఎంతో మంది నిరూపించారన్నారు. అలాంటి ఆదర్శవంతులను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. దృష్టి లోపం ఉన్నా కరుణా కుమారి పట్టుదలతో రాణించి అవార్డు సాధించారు. అంతర్జాతీయ ప్రపంచ కప్ క్రికెట్‌లో 42 పరుగులు సాధించి భారత్‌కు కప్ అందించారు. ఆమె ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివి ఈ స్థాయికి చేరిందంటే నేను గర్విస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని స్పూర్తి పొందాలని, అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు.
దివ్యాంగులకు సీఎం వరాలు:
- ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
- స్థానిక సంస్థల్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధి ఎక్స్ఆఫీషియోగా నామినేట్
- ఆర్థిక సబ్సిడీ పునరుద్దరణ
- క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్ స్కీమ్స్
- హౌజింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్లలో ఇళ్లు మంజూరు
- వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు.
- అమరావతిలో దివ్యాంగ భవన్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




