iPhone Fold: ఐఫోన్ ఫోల్డ్ గురించి వివరాలు లీక్.. ఫీచర్స్, ధర ఎంత ఉంటుందో తెలుసా?
iPhone Fold: JJPMorgan పరిశోధన నివేదిక ప్రకారం.. ఇటీవలి లీక్‌లు ఫోల్డబుల్ ఐఫోన్‌లో 24-మెగాపిక్సెల్ అండర్-డిస్ప్లే, కెమెరాను దాని ఇంటర్నల్ డిస్‌ప్లేలో అనుసంధానించవచ్చని సూచిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ ఇంటర్నల్ స్క్రీన్ ఉపయోగంలో లేనప్పుడు కెమెరా కనిపించదు. ఫోన్ అంతర్గత డిస్ప్లే డిజైన్ పూర్తిగా..

iPhone Fold: ఆపిల్ నుంచి ఏదైనా ఫోన్ విడుదల అవుతుందంటే చాలు దాని గురించే ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ త్వరలో రానుంది. ఇటీవలి అనేక నివేదికలు, లీక్‌లు ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ గురించి వివరాలను వెల్లడించాయి. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ గతంలో ఐఫోన్ ఫోల్డ్ 7.8-అంగుళాల ఇంటర్నల్ డిస్‌ప్లే, 5.5-అంగుళాల బాహ్య డిస్‌ప్లేను కలిగి ఉంటుందని నివేదించారు. మడతపెట్టినప్పుడు పరికరం మందం 9-9.5 మిమీ మధ్య ఉండవచ్చు. ఐఫోన్‌లో నాలుగు కెమెరాలు కూడా ఉండవచ్చు. అయితే ఇది వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ ఫోల్డ్ ధర (అంచనా)
MacRumors నివేదిక ప్రకారం, iPhone Fold ధర $2,000– $2,500 మధ్య ఉండవచ్చు. భారతదేశంలో దీని ధర రూ.170,000 – రూ.210,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఇది నిజమైతే ఇది iPhone చరిత్రలో అత్యధిక ధర కావచ్చు.
ఐఫోన్ ఫోల్డ్ స్పెసిఫికేషన్లు (అంచనా)
JPMorgan పరిశోధన నివేదిక ప్రకారం.. ఇటీవలి లీక్‌లు ఫోల్డబుల్ ఐఫోన్‌లో 24-మెగాపిక్సెల్ అండర్-డిస్ప్లే, కెమెరాను దాని ఇంటర్నల్ డిస్‌ప్లేలో అనుసంధానించవచ్చని సూచిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ ఇంటర్నల్ స్క్రీన్ ఉపయోగంలో లేనప్పుడు కెమెరా కనిపించదు. ఫోన్ అంతర్గత డిస్ప్లే డిజైన్ పూర్తిగా మృదువైనదిగా, లైన్లు లేకుండా ఉంటుందని, ఫోల్డబుల్ ఫోన్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
బ్యాటరీ విషయానికొస్తే.. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ఈ ఫోన్‌లో 5,400mAh, 5,800mAh మధ్య బ్యాటరీ ఉండవచ్చని సూచిస్తున్నారు. అయితే, కొంతమంది చైనీస్ టిప్‌స్టర్లు దీని సామర్థ్యం 5,000mAh కంటే ఎక్కువగా ఉండవచ్చని సూచించారు. 7.8-అంగుళాల డిస్ప్లేతో ఉన్న ఈ ఫోన్.. ఐఫోన్‌లో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ బ్యాటరీ కొత్త, అధిక-సాంద్రత గల సెల్‌లను ఉపయోగిస్తుందని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది బ్యాటరీ సామర్థ్యంలో Samsung Galaxy Z Fold 7ని అధిగమిస్తుంది. ఇది ఏ ఐఫోన్ మోడల్‌లోనైనా అత్యంత కెపాసియస్ బ్యాటరీగా మారుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








