Coronavirus: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
Coronavirus: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత టీకాను వేయించుకున్న...
Coronavirus: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత టీకాను వేయించుకున్న 5 లక్షల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు మలిదశ వ్యాక్సిన్ అందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర అధికార యంత్రాంగం వ్యాక్సినేషన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యిందన్నారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ నెల 19 వ తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుందని, వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా పర్యవేక్షించేందుకు యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. వైద్యాధికారులందరూ లబ్దిదారుల వివరాలను ఎప్పుటికప్పుడు ఈ యాప్‌లో పొందుపర్చాలన్నారు. ఇందుకోసం ప్రతి వైద్యాధికారికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లను వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిందన్నారు.
ఈ యాప్‌లో లాగిన్ అయ్యే ప్రతి వైద్యాధికారికి ఇంకా వ్యాక్సినేషన్ పొందని వారి వివరాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అలాగే, ఈ యాప్‌లో లబ్ధిదారుల వివరాలు, వారి రిజిస్ట్రేషన్ ఐడీ, మొబైల్ నెంబర్, పేరుతో సహా ఉంటాయని, అధికారులు వాటిని పరిశీలించవచ్చన్నారు. నిర్ణీత టైమ్ స్లాట్లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రతి ఫ్రంట్ లైన్, హెల్త్ వర్కర్ల మొబైల్‌లకు పంపించారు. తమకు నిర్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈనెల 20వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు సూచించారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల భద్రతకు ప్రభుత్వం అన్నిచర్యలూ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
Also read:
Sri Ramanujacharya Jayanti: ఈ రోజు విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజాచార్యుల జయంతి..